Sudigali Sudheer : ప్రభాస్‌ దర్శకుడితో సుడిగాలి సుధీర్‌ సినిమా.. నిజమేనా?

ప్రభాస్ దర్శకుడితో, పవన్ రైటర్ తో సుడిగాలి సుధీర్‌ కొత్త సినిమా. ఎవరు ఆ దర్శకుడు?

Sudigali Sudheer : ప్రభాస్‌ దర్శకుడితో సుడిగాలి సుధీర్‌ సినిమా.. నిజమేనా?

Sudigali Sudheer movie with prabhas director Dasaradh

Updated On : April 23, 2023 / 9:31 AM IST

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. దీంతో సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు ఛాన్సులు అందుకుంటూ వచ్చిన సుధీర్.. సాఫ్ట్‌వెర్ సుధీర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత త్రీ మంకీస్‌, వాంటెడ్‌ పండుగాడు వంటి సినిమాలతో కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ప్రేక్షకులను ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

7G Brindavan Colony : 7G బృందావన్ కాలనీ సీక్వెల్.. జూన్ నుంచి షూటింగ్!

దీంతో సుధీర్ ని ఆడియన్స్ హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదేమో అని మేకర్స్ అనుకుంటున్న సమయంలో ‘గాలోడు’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్‌ హిట్ ని అందుకొని ప్రొడ్యసర్‌లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆడియన్స్.. సుధీర్ ని హీరోగా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అని తేలిపోయింది. ఇక నిర్మాతలు కూడా సుదీర్ సినిమాకి డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే సుధీర్.. ఏకంగా ప్రభాస్ (Prabhas) దర్శకుడుని లైన్ లో పెట్టేశాడని తెలుస్తుంది.

Tollywood : ఇండియన్ సినిమాకి పాన్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది టాలీవుడ్.. నేపాలీ సూపర్ స్టార్!

ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ వంటి క్లాసిక్ హిట్ మూవీ తీసిన దశరథ్‌తో సుధీర్‌ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దశరథ్‌ చివరిగా మంచు మనోజ్ తో (Manchu Manoj) శౌర్య అనే మూవీని తెరకెక్కించాడు. 2016 లో వచ్చిన ఈ సినిమా తరువాత దశరథ్‌ మరో సినిమా తెరకెక్కించలేదు. ఇటీవల సుధీర్ కథని వినిపించగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దశరథ్‌ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం.