Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన కాంగ్రెస్ హైకమాండ్!

సీనియర్ ఎలక్షన్ సూపర్‭వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని హైకమాండుకు పంపింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం సుఖ్వీందర్ పేరును హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‭కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారట.

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన కాంగ్రెస్ హైకమాండ్!

Sukhwinder Singh Sukhu to be next Himachal CM, Congress high command approves

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందట. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‭గా పని చేసిన సుఖ్వీందర్ సింగ్‭ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సుఖ్వీందర్ వైపే ఎంపిక కమిటీ సైతం మొగ్గు చూపిందట. ఈరోజే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి అభ్యర్థిపై సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం కుర్చీపై ఆశాభావంతో ఉన్న ముగ్గురు నేతలు ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు సహా పార్టీ లెజిస్టేచర్ పాల్గొంది.

Bangladesh: బంగ్లా జాతీయ ఎన్నికల ముందు భారీ నిరసన.. ప్రభుత్వం ముందు 10 డిమాండ్లు

సీనియర్ ఎలక్షన్ సూపర్‭వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని హైకమాండుకు పంపింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం సుఖ్వీందర్ పేరును హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‭కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారట.

MCD: బీజేపీ నేతలపై ఆప్ హార్స్ ట్రేడింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కమల పార్టీ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకున్నారు. ఓట్ బ్యాంకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం రాగా బీజేపీకి 43 శాతం వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ బ్యాంకులో అతి స్వల్ప తేడానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.