Sunil: తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సునీల్.. హీరో ఎవరంటే?

టాలీవుడ్‌లో కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తరువాత హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్.. విలన్ పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునీల్ పర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు దక్కింది.

Sunil: తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సునీల్.. హీరో ఎవరంటే?

Sunil On Board For Vishal Next Movie Mark Antony

Sunil: టాలీవుడ్‌లో కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తరువాత హీరోగా మారిన సునీల్ ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్.. విలన్ పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునీల్ పర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు దక్కింది.

Sunil: మళ్ళీ హీరోగా సునీల్.. మరోసారి అదే తప్పు చేస్తున్నాడా?

ఆ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో సునీల్‌కు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీల్ తాజాగా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హీరో విశాల్ నటిస్తున్న ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో సునీల్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్.వినోద్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, విశాల్ ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమాతో సునీల్ తమిళనాట కూడా మంచి ఫేం సంపాదించాలని అభిమానులు కోరుతున్నారు.