Sunstroke : వేసవిలో వడదెబ్బ…ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
వడదెబ్బకు గురైన సందర్భంలో అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Sunstroke In Summer
Sunstroke : ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావంతో వడదెబ్బ, డీహైడ్రేషన్లకు గురవుతుంటారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతకు గురైన సందర్భంలో శారీరక, నాడీ పరమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. వేసవి సమయంలో ఎండల్లో ఎక్కవ సమయం గడిపే వారిలో శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల ఎక్కవ వేడి ఉత్పత్తి అవుతుంది.. అలా ఉత్పత్తి అయిన వేడి మన శరీరం లోని ఉష్ణ సమతుల్యత ని కాపాడె చర్మము ద్వారా చెమట రూపంలో బయటకు పోతుంది… అయితే శరీరం అధిక ఉష్ణోగ్రతలకు గురైన, డీ హైడ్రేషన్ గురైనా సందర్భాల్లో ఇబ్బంది కరమైన పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనినే హీట్ స్టోక్ గా పిలుస్తారు.
వడదెబ్బకు గురైన సందర్భంలో అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితోపాటుగా వాంతులు , నీరసం, దడ, ఆయాసము, గుండె వేగంగా కొట్టుకోవటం, కనఫ్యూజన్, చిరాకు, స్పృహ కోల్పోవడము వంటివి చోటు చేసుకుంటాయి. వడ దెబ్బ తగిలిన సందర్భంలో అత్యవసరంగా చికిత్స అందించాలి. లేదంటే కొంతమందిలో అది ప్రాణాపాయస్ధితికి దారితీసే అవకాశం ఉంటుంది.. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే వారి శరీరంపై ఉన్న బట్టలు తీసి, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలి. ఐస్ వాటర్ తో తడిపిన వస్తాన్ని అతని శరీరంపై కప్పాలి. ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్, ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం తాగించవచ్చు. వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి.
వడదెబ్బ బారిన పడకుండా తప్పించుకునేందుకు ముందుస్తుగా కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం. తరచుగా చల్లని నీరు త్రాగాలి. ఎండలో పనిచేసేవారు అప్పుడప్పుడు కొద్దిసేపు విరామం తీసుకోవాలి. సాధ్యమైన వరకు మద్యాహ్నం ఎండలో తిరగ కుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఆసమయంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వేసవిలో తెల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించటం మేలు. వేసవిలో దప్పికను పెంచే మద్యం వంటివాటిని తాగకుండా ఉండాలి. మీరు నివాసం ఉండే ఇంటి ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు తడిపిన పట్టలను చుట్టూ కట్టుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలి.