Sitara: సూపర్ డాటర్ వచ్చేసింది.. హైలైట్‌గా మారిన సితార ఎంట్రీ!

సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సర్కారు వారి పాట నుంచి దుమ్ములేపే మాస్ సాంగ్ వస్తుందనుకుంటే.. అంతకు మించి అన్న లెవెల్ లో పెన్నీ సాంగ్ ను రెడీ చేశారు మేకర్స్.

Sitara: సూపర్ డాటర్ వచ్చేసింది.. హైలైట్‌గా మారిన సితార ఎంట్రీ!

Sitara

Sitara: సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సర్కారు వారి పాట నుంచి దుమ్ములేపే మాస్ సాంగ్ వస్తుందనుకుంటే.. అంతకు మించి అన్న లెవెల్ లో పెన్నీ సాంగ్ ను రెడీ చేశారు మేకర్స్. ఏకంగా తండ్రి పాటలో సితార పాప స్టెప్పులను మిక్స్ చేసి వదిలారు. ఇంకేముంది స్టార్ డాటర్స్ ఎంట్రీ ఇస్తే మురిసిపోయే అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్ చూపిస్తున్నారు.

Sitara – Mahesh Babu : క్యూట్ పిక్.. సితార పాపతో సూపర్‌స్టార్..

సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్.. ప్రోమోతోనే రికార్డులు కొట్టేస్తుంది. మహేశ్ మాస్ స్టెప్పులకు తోడూ ఆయన కూతురు ఎంట్రీతోనే చేసిన డాన్స్.. ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫారిన్‌ లేడి గ్రూప్‌తో సూపర్ స్టార్ డ్యాన్స్‌ చేస్తుంటే.. మరో గ్రూప్‌ లీడ్‌ డ్యాన్స్‌ర్‌ గా సూపర్ డాటర్ స్టెప్పులేసింది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి మహేశ్ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపించే సితార.. ఇప్పుడిలా సర్కారు వారి పాట కోసం వచ్చేసి అందర్నీ ఫిదా చేసింది.

Sitara – Mahesh Babu : దుబాయ్‌లో సితార పాపతో సూపర్‌స్టార్..

ప్రెజెంట్ స్టార్ హీరోల డాటర్స్ ఒక్కొక్కరుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బన్నీ డాటర్ అల్లు అర్హ.. అంజలి పాటలో కనిపించి క్యూట్ ఎక్స్ ప్రెషెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత సమంతా లీడ్ రోల్ చేస్తోన్న శాకుంతలంలో నటించి బన్నీ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రిన్స్ భరతగా అల్లు అర్హ నటించింది.