Supreme Court Comments On Talaq : తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..‘తలాక్-ఇ-హసన్ సరైనదే’

తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తలాక్ -ఇ- హసన్‌ అన్యాయమేమీ కాదని తెలిపింది. తలాక్-ఇ-హసన్ సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తలాక్ -ఇ- హసన్ అంటే...నెలకోసారి చొప్పున..మూడు నెలల పాటు వరుసగా తలాక్ చెప్పి ఓ ముస్లిం తన భార్య నుంచి విడాకులు పొందవచ్చు.

Supreme Court Comments On Talaq : తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..‘తలాక్-ఇ-హసన్ సరైనదే’

Supreme Court comments on Talaq

Updated On : August 16, 2022 / 12:40 PM IST

Supreme Court Comments On Talaq : తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తలాక్ -ఇ- హసన్‌ అన్యాయమేమీ కాదని తెలిపింది. తలాక్-ఇ-హసన్ సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తలాక్ -ఇ- హసన్ అంటే…నెలకోసారి చొప్పున..మూడు నెలల పాటు వరుసగా తలాక్ చెప్పి ఓ ముస్లిం తన భార్య నుంచి విడాకులు పొందవచ్చు. ముస్లిం మహిళల జీవితాలకు ఆశనిపాతంలా మారిన త్రిపుల్ తలాక్‌ ముప్పు తొలిగిందనుకుంటే…ఇప్పుడు తలాక్-ఇ-హసన్‌ను సుప్రీంకోర్టు సమర్థించడం వివాదస్పదమవుతోంది.

విస్తృత చర్యలు, తీవ్ర వ్యతిరేకత తర్వాత కేంద్రం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేసింది. అంతకుముందు సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు తలాఖ్-ఇ-హసన్ మాత్రం సరైనదే అంటూ వ్యాఖ్యానించడం కొత్త చర్చను రాజేసింది. వరుసగా మూడు నెలలు తలాక్ చెప్పి వివాహ బంధం నుంచి పురుషుడు వైదొలగడం సరైనదే అని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడడంతో..ముస్లిం మహిళల జీవితాల్లో అభద్రత నెలకొంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Gujarat : ఇన్ స్టాగ్రాం ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్!

పురుషులు తలాక్‌-ఇ-హసన్‌ ద్వారా విడాకులు పొందవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలు ఖులా ద్వారా భర్త నుంచి విడిపోవచ్చని తెలిపింది. ఖులా అంటే…భర్త నుంచి పొందిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా లేదా ఇవ్వకుండానైనా విడాకులు పొందే అవకాశం. తలాక్ -ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.