Gujarat : ఇన్ స్టాగ్రాం ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్!

ఇటీవలే తన భర్త వ్యవహారం గురించి ఆరా తీయాలని భావించిన సదరు యువతి... నకిలీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ అకౌంట్ తన భార్యదేనని గ్రహించిన...

Gujarat : ఇన్ స్టాగ్రాం ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్!

Instragram

Man Gives Instant Triple Talaq To Wife Through Instagram : సోషల్ మీడియాను ఉపయోగించి.. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్రేత్ తాలూకా ప్రాంతంలో నివాసం ఉండే 27 ఏళ్ల యువతి.. తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. 2019 నవంబర్ నెలలో మహిసాగర్ జిల్లాలోని దేబార్ గ్రామానికి చెందిన వ్యక్తితో యువతి వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత..ఆమెను ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోందని పోలీసులు వెల్లడించారు. గత జులైలో బయటకు పంపిన సందర్భంలో…ట్రిపుల్ తలాక్ చెప్పాడని తెలిపారు. అయితే.. తనకు ట్రిపుల్ తలాక్ చట్టం గురించి పూర్తిగా తెలియదని.. అందుకనే తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆ యువతి పేర్కొంది.

Read More : Cyber Crime : కేవైసీ పేరుతో ఘరానా మోసం.. రూ.15లక్షలు మాయం

ఇటీవలే తన భర్త వ్యవహారం గురించి ఆరా తీయాలని భావించిన సదరు యువతి… నకిలీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ అకౌంట్ తన భార్యదేనని గ్రహించిన ఆ వ్యక్తి…సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో బుధవారం వారు పోలీసులను ఆశ్రయించినట్లు సబ్ ఇన్స్ పెక్టర్ చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ట్రపుల్ తలాక్ ఫిర్యాదుపై ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.