Suriya : ఆస్కార్ కమిటీలోకి ఆహ్వానం.. మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూర్య..

తమిళ స్టార్ హీరో సూర్య తన విలక్షణమైన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించారు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌ సినిమాలు ఇండియా తరపున ఆస్కార్ బరిలో నిలిచినా...........

Suriya : ఆస్కార్ కమిటీలోకి ఆహ్వానం.. మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూర్య..

Suriya

Oscar :  తమిళ స్టార్ హీరో సూర్య తన విలక్షణమైన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించారు. ఇటీవల సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌ సినిమాలు ఇండియా తరపున ఆస్కార్ బరిలో నిలిచినా ఫైనల్ స్టేజికి వెళ్లలేకపోయాయి. తాజాగా సూర్యకి మరో అరుదైన గౌరవం దక్కింది. సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కమిటీలో మెంబర్ గా సూర్యకి అకాడమీ నుంచి ఆహ్వానం అందింది.

గతంలో చిరంజీవి 1987లో ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఇప్పుడు సూర్య ఏకంగా అవార్డ్స్ కమిటీలో చోటు సంపాదించారు. తాజాగా అకాడమీ ఈ లిస్ట్ ని విడుదల చేయగా ఇందులో సౌత్ ఇండియా నుంచి సూర్య సెలెక్ట్ అయ్యారు. భారత్ నుంచి సూర్యతో పాటు నటి కాజోల్‌, దర్శకురాలు రీమా కగ్జి, నిర్మాతలు ఆదిత్య సూద్‌, సుష్మిత్‌ ఘోష్‌, రింటు థామస్‌ లు కూడా ఇందులో భాగమవనున్నారు.

Archana : మగధీర సినిమాలో ఛాన్స్ వదులుకున్నా.. అది చేసి ఉంటే..

ఈ మేరకు ఆస్కార్ కమిటీ పోస్ట్ చేసిన న్యూస్ ని షేర్ చేస్తూ.. ”ఈ ఆహ్వానాన్ని గౌరవంతో అందుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు”అని పోస్ట్ చేశాడు. పలువురు సెలబ్రిటీలు సూర్యకి అభినందనలు తెలుపుతున్నారు.