Sushmita Sen: బ్రేకింగ్ న్యూస్.. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌కు గుండెపోటు.. షాక్‌లో ఫ్యాన్స్!
మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్ తన అభిమానులకు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. తాను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ వర్గాలు ఖంగుతిన్నాయి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో సుస్మితా సేన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Sushmita Sen Confirms Of Heart Attack
Sushmita Sen: మాజీ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్ తన అభిమానులకు షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. తాను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ వర్గాలు ఖంగుతిన్నాయి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో సుస్మితా సేన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
ఆనాటి ‘మిస్ ఇండియా’ సుందరీమణుల ఫొటోలు చూశారా?
కాగా, రెండు రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని.. తనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి గుండెలో స్టెంట్ వేశారంటూ తన ఆరోగ్యం గురించి ఇన్‌స్టా పోస్ట్‌లో తెలియజేసింది ఈ మాజీ విశ్వసుందరి. అయితే తనకు వైద్యం చేసిన డాక్టర్లు ప్రస్తుతం తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధీమా ఇచ్చారని ఆమె పేర్కొంది. తనను ప్రమాదం నుంచి కాపాడిన వైద్యులకు తాను రుణపడి ఉంటానంటూ సుస్మితా పేర్కొంది.
Lalit Modi: సుశ్మితా సేన్‌ను భార్యగా ప్రకటించిన లలిత్ మోదీ
అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని తన అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియజేసేందుకే అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది సుస్మితా. ఇక ఈ విషయంతో ఒక్కసారిగా అభిమానులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన హీరోయిన్‌కు గుండెపోటు వచ్చిందనే వార్త బాలీవుడ్ మీడియాలో ఎందుకు రాలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని వారు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఏదేమైనా ఓ స్టార్ బ్యూటీకి ఇలా హార్ట్ ఎటాక్ రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
View this post on Instagram