TRS Support : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుపై ఉత్కంఠ

ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా.. రాజకీయంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని వ్యూహం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

TRS Support : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుపై ఉత్కంఠ

Trs Support

TRS Support : రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. నూతన రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై పడింది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా.. రాజకీయంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని వ్యూహం సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఓ వేదికను సిద్ధం చేసేందుకు పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్.. ప్రాంతీయ పార్టీల అధినేతలతో పలు దఫాలుగా భేటీలు నిర్వహించారు.

అయితే, సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్న ఉద్దవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, జేడీఎస్ నేత దేవెగౌడలు ముర్ముకు మద్దతు తెలిపి చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్లో కేసీఆర్ ఎవరికి మద్దతిస్తారన్న చర్చ జరుగుతోంది. ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్ ఖడ్ నామినేషన్ వేశారు. ఇక విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Vice Presidential Polls: విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు టీఎమ్‌సీ దూరం

బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్ ధన్ ఖడ్.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్​ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్​సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపటంతో.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‍సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్​ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే.