T20 world cup 2021..Sania Mirza : షోయబ్ మాలిక్ సిక్సర్లు..సానియా చప్పట్లు..ఏకిపారేస్తున్న నెటిజన్లు

T20 world cup 2021 నుంచి టీమిండియా నిష్క్రమించిది. మరోపక్క పాక్ రాణిస్తోంది. ఈక్రమంలో పాక్ క్రికెట్ షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే సానియా చప్పట్లు కొట్టటంతో నెటిజన్లు ఫైర్..

T20 world cup 2021..Sania Mirza : షోయబ్ మాలిక్ సిక్సర్లు..సానియా చప్పట్లు..ఏకిపారేస్తున్న నెటిజన్లు

T20 World Cup 2021 Sania Mirza Cheers For Shoaib Malik

T20 world cup 2021: sania mirza cheers for shoaib malik : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్యాభర్తలనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. భారతీయురాలు పాకిస్థాన్ కోడలైంది. ఈ క్రమంలో సానియా జంట మరోసారి వార్తల్లో నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్ చిట్టచివరి దశకు వచ్చేసిన క్రమంలో పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఎట్టకేలకి ఫామ్ అందుకున్నాడు. స్కాట్లాండ్‌తో ఆదివారం (నవంబర్7,2021) రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 1×4, 6×6 సాయంతో 54 పరుగులు చేసి షోయబ్ మాలిక్..పాకిస్థాన్‌కి భారీ స్కోరుని పరుగులు పెట్టించాడు. స్లాగ్ ఓవర్లలో మాలిక్ సిక్సర్లు కొడుతుంటే.. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ని వీక్షించిన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్.. సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది.

Read more : T20 World Cup 2021: వాటే మ్యాచ్… పాకిస్తాన్‌‌పై సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ముందు అఫ్గానిస్థాన్ టీమ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో భారత్ జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో.. భారతీయులు నిరాశ చెందారు.ఇండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కు సానియా మీర్జా నవ్వుతూ సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనే టీమిండియాని 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడించేసిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇదే తొలిసారి అయినా క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు.

Read more : T20 World Cup 2021: ధోనీ చెప్పినట్లుగా ఆడి జట్టును గెలిపించిన మిచెల్

ఈక్రమంలో సానియా మీర్జా భర్త సోయబ్ సిక్సర్లు కొడుతుంటే చప్పట్లు కొడుతు మద్దతు తెలిపింది. సానియా పక్కనే కూర్చుని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య సామియా ఆర్జూ కూడా పాకిస్థాన్‌కి సపోర్ట్ చేస్తూ కనిపించింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం సానియా మీర్జా భారతీయులరాలు కావటం..సోయబ్ పాకిస్థానీ కావటం అస్సలు చిక్కంతా. అలాగే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య సామియా ఆర్జూ కూడా భారతీయురాలే. సామియా హర్యానాలోని పారిదాబాద్‌లో జన్మించింది. ఆమె పాక్ క్రికెటర్ హసన్ అలీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో.. ఈ ఇద్దరూ భారత్ జట్టు సెమీస్‌కి చేరలేదనే బాధని మరిచి పాకిస్థాన్‌కి సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. కానీ.. సానియా మీర్జా ఇలా ట్రోల్‌ చేస్తున్నారు. కాగా..సానియా మీర్జా వివాదాలకు గురి కావటం..ట్రోలింగ్ కు గురి కావటం కూడా కొత్తేమీ కాదు..