Hema : రేవ్ పార్టీ ఇష్యూ తర్వాత మొదటిసారి తిరుమలలో హేమ.. రేవ్ పార్టీ ఇష్యూ గురించి అడిగితే ఏం చెప్పిందంటే..

హేమ నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.

Hema : రేవ్ పార్టీ ఇష్యూ తర్వాత మొదటిసారి తిరుమలలో హేమ.. రేవ్ పార్టీ ఇష్యూ గురించి అడిగితే ఏం చెప్పిందంటే..

Artist Hema Visited Tirumala Temple and comments on Rave Party with Media

Updated On : June 28, 2024 / 12:23 PM IST

Artist Hema : క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీలో పాల్గొన్నా పాల్గొనలేదని చెప్పడం, బెంగుళూరు పోలీసులు హేమ పాల్గొంది అని చెప్పడం, హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పడం, విచారణకు పిలవడం.. ఇలా కొన్ని రోజుల పాటు హేమ వైరల్ అయింది.

అయితే ఆ వివాదం తర్వాత హేమ మీడియా ముందుకు రాలేదు. తాజాగా హేమ నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. దీంతో తిరుమల నుంచి హేమ వీడియోలు వైరల్ గా మారాయి. పలువురు జనాలు హేమతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. హేమ దర్శనం చేసుకొని బయటకి వచ్చిన తర్వాత మీడియా ఆమె వద్దకు వచ్చారు.

Also Read : Prabhas : ‘కల్కి’లో ప్రభాస్ చేసిన పాత్ర.. ఆల్రెడీ ఏక్ నిరంజన్ సినిమాలోనే చేసేసాడు తెలుసా..?

హేమ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం బాగా జరిగింది. నేను ఇక్కడే పుట్టానని మీకు తెలుసు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా పుట్టిల్లులా ఉంటుంది అని తెలిపింది. అయితే మీడియా రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్రశ్నించడంతో హేమ సమాధానమిస్తూ.. ఏమో మీకే తెలియాలి, మీరే వార్తలు రాస్తున్నారు కదా అని చెప్పడం గమనార్హం.