T20 World Cup 2021 : కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ పోరాడి ఓడింది.

T20 World Cup 2021 : కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

T20 World Cup 2021 South Africa Beats England

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ పోరాడి ఓడింది. 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ 37, డేవిడ్ మలన్ 33, లివింగ్ స్టోన్ 28, జోస్ బట్లర్ 26, జేసన్ రాయ్ 20 పరుగులు(రిటైర్డ్ హర్ట్) చేశారు. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కు 14 పరుగులు అవసరం కాగా కేవలం మూడు పరుగులే చేసింది. ఆఖర్లో సౌతాఫ్రికా బౌలర్లు కమ్ బ్యాక్ చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 3, తబ్రెయిజ్ షంసి 2, ప్రిటోరియస్ 2, అన్రిచ్ నోర్జే ఒక వికెట్ తీశారు. చివరి ఓవర్‌లో రబాడ హ్యాట్రిక్‌ సాధించాడు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంత భారీ స్కోరు చేసిందంటే అందుకు కారణం వన్ డౌన్ బ్యాట్స్ మన్ వాన్ డర్ డుస్సెన్ విధ్వంసక ఇన్నింగ్సే.

వాన్ డర్ డుస్సెన్ శివమెత్తాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లోనే 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అతడికి మార్ క్రమ్ కూడా తోడవ్వడంతో సఫారీ స్కోరు బోర్డు దూసుకెళ్లింది. మార్ క్రమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ డికాక్ 34 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

సౌతాఫ్రికా గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో దక్షిణాఫ్రికా గెలిచినప్పటికీ సెమీస్‌ రేస్‌ నుంచి తప్పుకుంది. దీంతో సూపర్‌ 12 గ్రూప్‌ 1 నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో 8 పాయింట్లతో సమానంగా ఉన్నా.. సౌతాఫ్రికా నెట్ రన్ రేట్ 0.739 కాగా, ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ 1.216గా ఉంది. ఇక ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ 2.464గా ఉంది.

స్కోర్లు..
సౌతాఫ్రికా – 189/2
ఇంగ్లాండ్ – 179/8