TATA Steel: యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యాన్ని నిలిపివేసిన టాటా స్టీల్

ష్యాలో ఎటువంటి ప్లాంట్ లు, కార్యాలయాలు, ఉద్యోగులు లేరని, రష్యాతో వాణిజ్యాన్ని మాత్రం నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది

TATA Steel: యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యాన్ని నిలిపివేసిన టాటా స్టీల్

Tata

TATA Steel: ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాతో వ్యాపారాన్ని నిలిపివేస్తామని టాటా స్టీల్ ప్రకటించింది. భారత్, యూకే మరియు నెదర్లాండ్స్‌లోని టాటా స్టీల్ యూనిట్లు ముడి పదార్థాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించాలని, ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. “మాకు(టాటా స్టీల్) రష్యాలో ఎటువంటి ప్లాంట్ లు, కార్యాలయాలు, ఉద్యోగులు లేరని, రష్యాతో వాణిజ్యాన్ని మాత్రం నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పటికే రష్యాలో కార్యకలాపాలు నిలిపివేశాయి.

Also read:Indian Navy Submarine: “యార్డ్ 11880” జలాంతర్గామిని ప్రారంభించిన భారత నేవీ

భారత టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించగా..తాజాగా మరో భారతీయ కంపెనీ అయిన టాటా స్టీల్ కూడా రష్యాతో వాణిజ్యాన్ని తెంచుకుంది. ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ అయిన టాటా స్టీల్ కు యూకేలోనూ, నెదర్లాండ్స్ లోనూ భారీ స్టీల్ సంస్థలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో ఉక్కు తయారీ ప్రక్రియ కోసం రష్యా నుండి బొగ్గును దిగుమతి చేసుకుంటుంది. అయితే యుక్రెయిన్ విషయంలో రష్యా ఎంత మాత్రం వెనక్కు తగ్గకపోవడం పై టాటా స్టీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. రష్యా నుంచి బొగ్గు సేకరణ చిన్న అంశమని టాటా స్టీల్ తెలిపింది.

Also read:Argentina : రైలు కింద పడిన యువతి.. చివరిలో ఏం జరిగిందంటే