Telangana: తెలంగాణలో 4నెలల్లో 3కోట్ల వ్యాక్సినేషన్లు

గతేడాది సంక్రాంతి తర్వాతి రోజు 2021 జనవరి 16 నుంచి మొదలైన వ్యాక్సినేషన్ సంవత్సరంలోగానే 5కోట్ల వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకుని రికార్డ్ నమోదు చేసింది.

Telangana: తెలంగాణలో 4నెలల్లో 3కోట్ల వ్యాక్సినేషన్లు

Vaccination

Telangana: కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల్లో 3కోట్ల వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకుంది. గతేడాది సంక్రాంతి తర్వాతి రోజు 2021 జనవరి 16 నుంచి మొదలైన వ్యాక్సినేషన్ సంవత్సరంలోగానే 5కోట్ల వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకుని రికార్డ్ నమోదు చేసింది.

జూన్ 29వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కాస్త ఆలస్యమైంది. తొలి ఆరు నెలల్లో కోటి మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయగలిగారు. కోటి 8లక్షల 72వేల 157డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. సెప్టెంబర్ 15నాటికి 2కోట్ల 4లక్షల 68వేల 926మందికి వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.

తర్వాత నాలుగు నెలలు అంటే సెప్టెంబర్ 15 నుంచి జనవరి 13వరకూ ప్రభుత్వంలోని పలు డిపార్ట్ మెంట్ల కోఆర్డినేషన్ తో అర్హత కలిగిన వారికి మూడు వ్యాక్సిన్ల డోసుల పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

స్టేట్ హెల్త్ వింగ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్, పోలీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ల సహకారంతోనే చేయగలిగామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.