Telangana Budget 2022-23 : గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ.. బీజేపీ నేతల ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమవుతాయని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం..

Telangana Budget 2022-23 : గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ.. బీజేపీ నేతల ఆగ్రహం

Governor Tamilsai Soundararajan

Without Governor Speech : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమవుతాయని ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ నిర్వహిస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనన్నారు తమిళిసై. సుదీర్ఘ విరామం తర్వాత సమావేశాలు జరిగితే అది కొత్త సెషనే అవుతుందని.. కానీ ప్రభుత్వం పాత సెషన్‌కు కొనసాగింపు అని చెబుతుందన్నారు. ఫైనాన్స్‌ బిల్లు తీసుకొచ్చినప్పుడు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందన్నారని.. ఆ తర్వాత సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ఫైనాన్స్‌ బిల్లును సిఫారసు చేశానన్నారు.

Read More : Telangana : టుడే తెలంగాణ కేబినెట్ భేటీ..2022-23 బడ్జెట్‌‌కు ఆమోదం

గవర్నర్ ప్రసంగం అనేది గవర్నర్ ఆఫీస్‌కు సంబంధించిన అంశం కాదన్న తమిళిసై.. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలే ఉంటాయన్నారు. గత ఏడాది సాధించిన విజయాలు.. ఈ ఏడాది చేయబోయే అంశాలు మాత్రమే ఉంటాయన్నారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సిన అవసరముందన్నారు.  స‌మావేశాల సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన అంశాల‌పై ఇప్పటికే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రొటెం చైర్మన్ అమీనుల్ జాఫ్రీలు స‌మీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉన్నా.. త‌గిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అధికారులు స‌భ్యులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా స‌మాచారం అందించేందుకు రెడీగా ఉండాల‌ని సూచించారు. గ‌తంలో జ‌రిగిన స‌మావేశాల‌కు సంబంధించిన ప్రశ్నల‌ను వెంట‌నే స‌భ్యుల‌కు అందేలా చూడాల‌ని అధికారుల‌ను స్పీక‌ర్ ఆదేశించారు. శాస‌న‌స‌భా స‌మావేశాల నిర్వహ‌ణ‌లో అధికారులు అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించాల‌ని స్పీక‌ర్ ఆదేశించారు.