Vari Deeksha : రేవంత్, కోమటిరెడ్డిలకు నిమ్మరసం ఇచ్చిన జానారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.

Vari Deeksha : రేవంత్, కోమటిరెడ్డిలకు నిమ్మరసం ఇచ్చిన జానారెడ్డి

Varideeksha

Telangana Congress : ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పోరుబాట సాగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. వెంటనే కల్లాల్లోని వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు హస్తం నేతలు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు 48 గంటల ‘వరి దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసేందే. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శనివారం ప్రారంభమైన దీక్ష.. ఆదివారం రెండోరోజు ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.

Read More : Omicron : ఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లైన్స్

పీసీసీ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రైతులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధాన్యం కొనుగోలు ఇష్యూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హస్తం నేతలు గళమెత్తారు. రెండు ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వడ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ…వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ దీక్షకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

Read More : Tallest Pier Bridge : భారతీయ రైల్వేకి కాదేదీ అసాధ్యం..ప్రపంచంలోనే ఎత్తైన పిల్లర్ బ్రిడ్జ్ మన దగ్గరే

అధికారంలో ఉన్న సమయంలో అనేక సమస్యలు పరిష్కరించబడిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపాన్ని నెడుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే కాకుండా…ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టాలను తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే..అప్పుడు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అప్పటి వరకు ప్రజల గోసను ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుందన్నారు. ప్రజలను ఆ రెండు పార్టీలను పక్కకు పెడుతారని, కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు జానారెడ్డి సూచించారు.