telangana: రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ‌ మ‌హిళా కాంగ్రెస్ నేత‌ల య‌త్నం telangana mahila congress president arrested by police

telangana: రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ‌ మ‌హిళా కాంగ్రెస్ నేత‌ల య‌త్నం

తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు రాజ్ భవన్ ముట్టడికి ప్ర‌య‌త్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం జరిగింది.

telangana: రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ‌ మ‌హిళా కాంగ్రెస్ నేత‌ల య‌త్నం

telangana: తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు రాజ్ భవన్ ముట్టడికి ప్ర‌య‌త్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస‌రిస్తోన్న తీరుకి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయంటూ వారు మండిప‌డ్డారు.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

వారిని అడ్డుకున్న పోలీసులు, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడం ఏంటంటూ ఈ సంద‌ర్భంగా మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు మండిప‌డ్డారు. మహిళా దర్బార్ నిర్వహించడం కాదని, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌రిష్క‌రించాల‌ని వారు అన్నారు. ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

×