KTR America Tour : తెలంగాణలో పెట్టుబడుల కోసం కేటీఆర్ అమెరికా టూర్
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లారు మంత్రి కేటీఆర్. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు.

KTR America tour
KTR America Tour : తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లారు మంత్రి కేటీఆర్. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నారు. మరోవైపు మన ఊరు – మన బడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి పెద్ద ఎత్తున విరాళాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్.
దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్న తెలంగాణ…మరిన్ని పెట్టుబడులు సాధించడంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఎన్‌ఆర్‌ఐలు, పలు పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు కేటీఆర్.
ఇప్పటికే పెట్టబడులకు హబ్‌గా తెలంగాణ మారింది. అంతర్జాతీయ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ సంస్థలు హైదరాబాద్‌ను తమ వ్యాపార విస్తరణకు కేంద్రంగా మార్చుకున్నాయి. ఒక్క సాఫ్ట్‌వేర్ కంపనీలే కాకుండా…ఫార్మా, ఆటోమోబైల్, టెక్స్ టైల్స్, బయో, లైఫ్ సైన్సెస్‌లాంటి అనేక రంగాల సంస్థలు తరలివచ్చాయి.
Also Read : Chinna Jeeyar Swamy: 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అది మా అభిమతం కానే కాదు: చిన్నజీయర్ స్వామి
అయితే మరిన్ని పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా.. మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ కొనసాగనుంది. ఈనెల 26 వరకు మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులతో ప్రత్యేక సమావేశాలలో పాల్గొంటారు మంత్రి కేటీఆర్.
Also Read : Nagarjuna Sagar Car : చనిపోయినట్లు నమ్మించడానికి.. కారును సాగర్ కాలువలోకి నెట్టిన జంట
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు- మన బడి పథకానికి నిధుల సమీకరణ చేయనున్నారు. కోటి రూపాయలు ఆపైన విరాళం ఇచ్చే దాతల పేరును ఆ పాఠశాలకు పెడతారు. 20 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరును తరగతి గదికి పెట్టనున్నారు.మొత్తానికి ఓ వైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా…పథకాల అమలులో ఎన్‌ఆర్‌ఐలను భాగం చేసేందుకు ప్రభుత్వం ఈ టూర్‌ను ఉపయోగించుకోనుంది.