Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

ప్రతిరోజూ దాదాపుగా 2లక్షల మందికి వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ డోసులు వేశారు. ఉన్న జనాభా కన్నా ఎక్కువగానే అందించారు..

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

Corona Vaccination

Telangana State Corona Vaccine : వాక్సినేషన్ ప్రక్రియ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం.. టాప్ పొజిషన్‌లో నిలిచింది. టీకాల ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి డోస్ 105శాతం పూర్తయ్యింది. రెండో డోస్ కూడా దాదాపుగా 100 శాతానికి చేరువలో ఉంది. నిన్న మొన్న మొదలైన బూస్టర్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఏడాదిలోనే 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తవడానికి ప్రధాన కారణం.. క్షేత్రస్థాయిలో ఆశాలు, ANMలు, PHCల్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్, ఆరోగ్య కార్యకర్తలు కీలకపాత్ర పోషించారనే చెప్పాలి. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 5కోట్ల, 73లక్షల 28వేల 121 మందికి టీకాలు అందజేసింది ఆరోగ్య శాఖ. అంటే మన రాష్ట్ర జనాభా కన్నాఎక్కువే వాక్సిన్ అందజేశారు. మొత్తంగా 15ఏళ్ళు నిండిన వారికి 105శాతం మందికి టీకాలు అందజేశారు.

Read More : India Corona : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

ప్రతిరోజూ దాదాపుగా 2లక్షల మందికి వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ డోసులు వేశారు. ఉన్న జనాభా కన్నా ఎక్కువగానే అందించారు. 120శాతం మొదటి డోస్ ఇచ్చారు. రెండవ డోస్ 101 శాతం పూర్తి చేశారు. ఈ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే వలస కూలీలు ఎక్కువగా ఉండటంతో అత్యధికంగా టీకాలు పంపిణీ జరిగిందని జిల్లా వైద్య అధికారులు చెబున్నారు.
ఇక రాష్ట్రంలో టీకాలు పంపిణీలో రెండవ స్థానంలో నిలిచింది హైదరాబాద్. అత్యధిక డివిజన్‌లు ఉన్న కేంద్రం కావడంతో phc పరిధిలో, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు, ఫీవర్ సర్వేలోనూ వ్యాక్సిన్ అందించడం వల్లే .. త్వరగా టార్గెట్ రీచ్ అయ్యామని.. జిల్లా అధికారులు అంటున్నారు.

Read More : Goa Schools : గోవాలో తగ్గిన కరోనా.. ఫిబ్రవరి 21 నుంచి స్కూళ్లు రీఓపెన్..

ఇప్పటికే మొదటి డోస్ 109శాతం పూర్తి అయ్యింది. రెండవ డోస్ 84శాతం అయ్యింది. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో మొదట్లోనే వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖత చూపకపోవడంతో.. కొంత గ్యాప్ వచ్చిందంటున్నారు అధికారులు. ఇక మిగతా జిల్లాలో కూడా వాక్సినేషన్ విజయవంతంగా సాగుతోంది. కొమరం భీమ్ జిల్లా మినహాయించి 32 జిల్లాలో 100శాతం వాక్సినేషన్ పూర్తయ్యింది. కొమరం భీమ్‌లో మాత్రమే మొదటి డోస్ 89శాతం అయ్యింది. ఇక రెండవ డోస్ కూడా 10జిల్లాలో 100శాతం పంపిణీ ముగిసింది. 11జిలాల్లో 90శాతానికిపైగా 100శాతానికి చేరువలో ఉంది. మరో 10జిల్లాలో 80శాతానికి పైగా వాక్సినేషన్ జరిగింది.. కేవలం రెండు జిల్లాలో 70శాతం దాటింది. మొత్తంగా రాష్ట్రంలో రెండవ డోస్ కూడా 92శాతం పూర్తయ్యింది. గత ఏడాది జనవరి 16వ తేదీన మొదలైన టీకాలు.. పంపిణీ ప్రారంభంలో కాస్త వ్యాక్సిన్ కొరతతో తక్కువగా జరిగినప్పటికీ.. రాను రాను పుంజుకుంది.