CCL 2023 : కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. అఖిల్ అక్కినేని స్కోర్ ఎంతో తెలుసా?
సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మళ్ళీ మొదలైంది. ఈరోజు తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ విజయం సాధించగా, అఖిల్ అక్కినేని..

telugu warriors defeat kerala strikers in ccl match akhil akkineni
CCL 2023 : భారతదేశంలో సినిమా, క్రికెట్ పై ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఆ రెండిటిని ఒకటి చేస్తూ అభిమానులకు కిక్కిచ్చేది సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL). వెండితెర పై అదిరిపోయే ఫైట్ చేసే హీరోలు, బ్యాట్ పట్టుకొనే ఫీల్డ్ లోకి దిగి బౌండరీలు కొడుతుంటే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలు పాల్గొనే ఈ CCL మ్యాచ్ ల్లో ఎన్టీఆర్-ఏఎన్నాఆర్ లు కూడా బ్యాట్ పట్టి సిక్సర్ కొట్టిన వారే. అయితే గత కొంత కాలంగా ఈ మ్యాచ్ లు జరగడం లేదు.
CCL 2023 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఏ టీంకి కెప్టెన్ ఎవరో తెలుసా? తెలుగు వారియర్స్ కెప్టెన్ ?
కానీ ఈ ఏడాది మళ్ళీ ఈ లీగ్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. ఈసారి మొత్తం ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ ఆడుతున్నాయి. నిన్నటి నుంచి CCL మొదలు కాగా.. నేడు తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కేరళ స్టార్స్ బౌలింగ్ ని ఎంచుకున్నారు. ఇక మొదటిగా బ్యాటింగ్ దిగిన టాలీవుడ్ స్టార్స్.. 10 ఓవర్ లో రెండు వికెట్లు కోలుపోయి 154 పరుగులు తీశారు. మొదటిగా బ్యాటింగ్ కి వెళ్లిన అఖిల అక్కినేని 30 బంతుల్లో 91 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. అలాగే తనతో పాటు గ్రీస్ లో నిలిచిన యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. వీరిద్దరి తరువాత గ్రీస్ లోకి హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు.
ఇక చేజింగ్ దిగిన కేరళ స్టార్స్ ని గట్టిగానే కట్టడి చేశారు. 10 ఓవర్ లకి కేవలం 98 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు. హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశాడు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం అఖిల్ కి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
CCL 2023 LIVE – Kerala Strikers vs Telugu Warriors | Match 3. #A23Rummy #HappyHappyCCL #ChaloSaathKhelein #LetsPlayTogether #A23 #KeralaStrikers #TeluguWarriors #KunchakoBoban #AkhilAkkineni #CCL https://t.co/H5zyY747r6
— CCL (@ccl) February 19, 2023