Tesla: కూర్చోవడానికీ ప్లేస్ లేని టెస్లా ఆఫీస్.. ఉద్యోగుల అవస్థలు

ఇటీవల కరోనా కేసులు తగ్గిన దృష్ట్యా ఉద్యోగులంతా తిరిగి ఆఫీస్‌లకు రావాల్సిందే అని ఆదేశించాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయకపోతే, ఉద్యోగంలోంచి తీసేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా లేని చాలా మంది తిరిగి ఆఫీస్‌కు వచ్చారు.

Tesla: కూర్చోవడానికీ ప్లేస్ లేని టెస్లా ఆఫీస్.. ఉద్యోగుల అవస్థలు

Elon Musk

Tesla: ‘ఆఫీస్‌కు వచ్చి పని చేస్తారా.. లేక ఉద్యోగం మానేస్తారా’ అంటూ తన కంపెనీ ఉద్యోగులను హెచ్చరించిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. వారికి ఆఫీస్‌లో సరైన సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక టెస్లా ఉద్యోగులు సతమతమవుతున్నారు. కోవిడ్ కారణంగా టెస్లా కంపెనీ ఉద్యోగుల్లో చాలా మంది రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పని చేస్తున్నారు.

Udaipur killing: కన్హయ్య హత్య నిందితులకు పాక్‌తో సంబంధాలు.. కేసు ఎన్ఐఏకు అప్పగింత

అయితే, ఇటీవల కరోనా కేసులు తగ్గిన దృష్ట్యా ఉద్యోగులంతా తిరిగి ఆఫీస్‌లకు రావాల్సిందే అని ఆదేశించాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయకపోతే, ఉద్యోగంలోంచి తీసేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా లేని చాలా మంది తిరిగి ఆఫీస్‌కు వచ్చారు. చాలా మంది ఉద్యోగులు టెస్లా ప్రధాన కార్యాలయమైన క్యాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్ ఆఫీస్‌కు వచ్చారు. కానీ, అక్కడ సౌకర్యాలు ఘోరంగా ఉన్నాయి. చాలా మంది సిబ్బంది కూర్చోవడానికి సరైన ప్లేస్ కూడా లేదు. డెస్కులు దొరకలేదు. కార్లు పార్కింగ్ చేసుకునేందుకు తగిన పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. మరోవైపు వై-ఫై కూడా సరిగ్గా పనిచేయలేదు. దీంతో చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా ఆఫీసుకొచ్చిన టెస్లా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు

ఈ నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫాలో అవ్వొచ్చా అని కొందరు ఉద్యోగులు మేనేజర్లను అడిగారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మొత్తం టెస్లా సంస్థల్లో 99,210 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, అవసరానికి మించిన ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. అందువల్ల వచ్చే మూడు నెలల్లో కనీసం పది శాతం మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కువ సిబ్బంది ఉండటం వల్లే డెస్కులు చాలడం లేదని, కూర్చోవడానికి ప్లేస్ దొరకడం లేదని టెస్లా ప్రతినిధులు అంటున్నారు.