Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు

గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేలకు షిండే చెప్పారు.

Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు

Floor Test

Floor Test: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరిన నేపథ్యంలో ఎవరికి వారు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ థాక్రే, శాసనసభలో గురువారం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధమవుతున్నారు.

PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేలకు షిండే చెప్పారు. రేపు జరగబోయే బల పరీక్ష కోసం గువహటిలో ఉన్న ఎమ్మెల్యేలంతా గోవా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజే బయల్దేరి ఎమ్మెల్యేలు గోవా చేరుకుంటారు. షిండే వర్గం ఎమ్మెల్యేలను ఎయిర్‌పోర్టు తీసుకెళ్లేందుకు, వాళ్లు బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్‌కు రెండు బస్సులు చేరుకున్నాయి. ముందుగా ఎమ్మెల్యేలంతా స్థానిక కామాఖ్య ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు.

Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్

అక్కడి నుంచి నుంచి ఎయిర్‌పోర్టు చేరుకుని, విమానం ద్వారా గోవా వెళ్తారు. సాయంత్రం గోవా చేరుకున్న తర్వాత వాళ్లు బస చేసేందుకు తాజ్ కన్వెన్షన్ హోటల్‌లో 70 రూమ్‌లను ఇప్పటికే బుక్ చేశారు. రేపు జరగబోయే విశ్వాస తీర్మానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటారు. మరోవైపు విశ్వాస పరీక్షపై శివసేన కోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పును అనుసరించి కూడా విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉంది.