Priyanka Gandhi Son : LV ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ప్రియాంక గాంధీ కుమారుడికి పరీక్షలు

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ హైదరాబాద్ రానున్నారు. LV ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రాకు పరీక్షలు చేయించనున్నారు.

Priyanka Gandhi Son : LV ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ప్రియాంక గాంధీ కుమారుడికి పరీక్షలు

Priyanka Gandhi Son

Tests for Priyanka Gandhi’s son at LV Prasad Eye Hospital : కాంగ్రెస్ నాయకురాలు, సోనియా గాంధీ కుమార్తె, ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ రానున్నారు. బుధవారం (నవంబర్ 24,2021) ఉదయం ప్రియాంకా గాంధీ హైదరాబాద్ లోని ప్రముఖ కంటి ఆస్పత్రి అయిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో తన కుమారుడు రైహాన్ వాద్రాకు మెడికల్ చెకప్ చేయించటానికి హైదరాబాద్ వస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి అయిన తరువాత మరుసటి రోజు అంటే గురువారం సాయంత్రం ప్రియాంకా తన కుమారుడితో కలిసి తిరిగి ఢిల్లీ పయనమవుతారు.కాగా గతంలో ఓసారి ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రాకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో మరోసారి పరీక్షలు చేయించేందుకు ప్రియాంకా గాంధీ తన కుమారుడితో కలిసి హైదరాబాద్ రానున్నారు.

Read more : Raihan Vadra : వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా ప్రియాంకా గాంధీ కుమారుడు..ఎగ్జిబిషన్ ఏర్పాటు

కాగా గతంలో ప్రియాంకా గాంధీ సడెన్ గా ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో ప్రత్యక్ష్యం అయ్యేసరికి అందరు ఆశ్చర్యపోయారు. అప్పటి రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి కూతరు పింకి రెడ్డితో కలిసి ప్రియాంకా గాంధీ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వచ్చారు. రైహాన్ వాద్రా క్రికెట్ అడుతున్న సమయంలో రేహన్ కంటికి దెబ్బతగిలింది. ఢిల్లీలోని ఎఐఐఎంఎస్ కు తీసుకువెళ్లి పరీక్ష చేయించారు. అక్కడి డాక్టర్లు వెంటనే హైదరాబాద్ లోని ఎల్ విప్రసాద్ ఇన్ స్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆమె హైదరాబాద్ కు కుమారుడ్ని తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో మరోసారి కుమారుడికి వైద్య పరీక్షలు చేయించటానికి హైదరాబాద్ రానున్నారు ప్రియాంకా గాంధీ. ‘ ఇది పూర్తిగా ప్రయివేటు పర్యటన. వైద్యపరీక్షల కోసం ఆమెవస్తున్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తులు వెళ్లి ఇబ్బంది పెట్టవద్దు,’ అని టెన్ జన్ పథ్ నుంచి సూచనలు వచ్చినట్లు సీనియర నాయకుడొకరు ఎసియానెట్ కు తెలిపారు.

Read more :Lakhimpur Kheri : హౌస్ అరెస్టు చేసిన గదిని ఊడ్చిన ప్రియాంక గాంధీ

కాగా కంటి వైద్యంలో ఎల్వీ ప్రసాద్ ఆస్పతి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది. 1987లో హైదరాబాదులో స్థాపించబడిన ఈ ఆస్పత్రి లక్షలాదిమందికి కంటిచూపును ప్రసాదించింది. పలు కంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గుళ్ళపల్లి నాగేశ్వరరావు ద్వారా 30 ఏళ్లక్రితం స్థాపించిన ఈ ఆస్పత్రి ఎటువంటి లాభాపేక్ష లేని..ప్రభుత్వేతర నేత్ర వైద్యశాలగా పేరొందింది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన , సమర్థవంతమైన కంటి సంరక్షణ LVPEI సంస్థ యొక్క లక్ష్యంగా పనిచేస్తోంది. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.

ప్రముఖ భారతీయ చలన చిత్ర నిర్మాత ఎల్. వి. ప్రసాద్ ఈ నేత్ర వైద్యశాల స్థాపన కొరకు బంజారా హిల్స్ చెక్ పోస్టుకు అత్యంత సమీపంలో 5 ఎకరాల స్థలం దానం చేసారు. భారీగా నగదు విరాళాన్ని కూడా ఇచ్చారు. ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆ సంస్థకు ఆయన పేరును ఆ సంస్థకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్సిస్ట్యూట్‌గా పేరు పెట్టారు.