Anasuya​ : అనసూయ యాక్టింగ్ అదరగొట్టేసింది.. ‘థ్యాంక్ యు బ్రదర్!’ ట్రైలర్..

ఓ యువ‌కుడు, గ‌ర్భ‌వ‌తి అయిన‌ మ‌హిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’..

Anasuya​ : అనసూయ యాక్టింగ్ అదరగొట్టేసింది.. ‘థ్యాంక్ యు బ్రదర్!’ ట్రైలర్..

Thank You Brother​

Thank You Brother​: అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రాన్ని ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు. ఓ యువ‌కుడు, గ‌ర్భ‌వ‌తి అయిన‌ మ‌హిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’..

Thank You Brother​

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ద్వారా మే 7న ఈ మూవీ విడుదలవుతోంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. గర్భవతి పాత్రలో అనసూయ నటన ఎమోషనల్‌గా ఆకట్టుకోవడమే కాకుండా, సినిమాపై అంచనాలు పెంచేసింది.. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి.. ‘ఆహా’ లో మే 7 నుండి ‘థ్యాంక్ యు బ్రదర్’ ప్రీమియర్ కానుంది..

Thank You Brother

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ క్వాలిటీ తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కులకు నేరుగా అందిస్తోంది. గ్రిప్పింగ్ కథ‌నం, వైవిధ్య‌మైన క‌థాంశం ఉన్న చిత్రాల‌ను ‘ఆహా’ నేరుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ చేస్తుంది. ‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్ర ట్రైల‌ర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచే కాదు.. రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, వెర్స‌టైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి స‌హా నెటిజ‌న్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆస‌క్తి క‌రంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, ఎగ్జ‌ైటింగ్ క్లైమాక్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌తో ‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్రం రూపొందింది..