Ganges Water : చనిపోయాడని నిర్దారించిన వైద్యులు.. నోట్లో గంగాజలం పోయగానే లేచి కూర్చున్నాడు

క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి స్మశానానికి తీసుకెళ్లి దహనానికి ఏర్పాట్లు చేస్తుండగా లేచి కూర్చున్నాడు.

Ganges Water : చనిపోయాడని నిర్దారించిన వైద్యులు.. నోట్లో గంగాజలం పోయగానే లేచి కూర్చున్నాడు

Ganges Water

Ganges Water : ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న సతీష్ భరద్వాజ్‌ (61)ని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అతడికి గత కొద్దీ రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆదివారం అతడిలో ఎటువంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు 11 మంది వైద్యుల బృందం నిర్దారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రి నుంచి తరలించారు.

చదవండి : Ganga River : ‘కుళ్లిన కరోనా మృత దేహాలతో గంగానది డంపింగ్ యార్డ్ అయింది’

సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో చితిపై పడుకోబెట్టారు. చితికి నిప్పంటించడానికి ముందు నోట్లో గంగాజలం పోయగా అతడిలో చలనం కనిపించింది. ఆ వెంటనే కళ్లు తెరిచి మాట్లాడాడు. తానిక్కడ ఎందుకున్నానని ప్రశ్నించడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Ganga River : భూమిపై అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ

మృతిచెందాడనుకున్న సతీష్ భరద్వాజ్, సజీవంగా ఉండటం కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచేసింది. గంగా జలానికి ఇంతశక్తి ఉంటుందని తామెప్పుడూ అనుకోలేదని సతీష్ కుటుంబ సభ్యులు అంటున్నారు. గంగాజలానికి అంత శక్తి వుందా అని చర్చించుకుంటున్నారు.