The Kerala Story : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా?

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు భయపడి స్వచ్ఛందంగా షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని చూశారు.

The Kerala Story : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా?

The Kerala Story movie getting good reviews

The Kerala Story :  కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అంటూ కొన్నాళ్లుగా బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలా అమ్మాయిలు మాయమై టెర్రరిజం వైపు వెళ్తున్న సంఘటనలపై ది కేరళ స్టోరీ(The Kerala Story) అనే టైటిల్ తో సినిమా వచ్చింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచి కూడా సినిమాపై పలువురు విమర్శలు చేస్తూ ఈ సినిమాని వివాదాల్లో నిలిపారు. కానీ ది కేరళ స్టోరీ సినిమాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇప్పటికే వచ్చిన విమర్శలపై డైరెక్టర్, హీరోయిన్ అదాశర్మ ఫైర్ అయ్యారు.

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు భయపడి స్వచ్ఛందంగా షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని చూశారు. కానీ చిత్రయూనిట్ హైకోర్టు వరకు కూడా వెళ్లి సినిమా ఆపకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం కర్ణాటక ఎలక్షన్స్ ప్రచారంలో ది కేరళ స్టోరీ సినిమాని సమర్థిస్తూ మాట్లాడారు. కొంతమంది థియేటర్ ఓనర్స్ ని భయపెట్టడంతో పలు చోట్ల మాత్రమే ది కేరళ స్టోరీ సినిమా రిలీజయింది.

అయితే సినిమాకి మంచి ఆదరణ వస్తుంది. సినిమా చూసిన వాళ్లంతా ఎమోషనల్ కంటెంట్ మాత్రమే కాదు చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి సినిమా తీయాలంటే, రియల్ సంఘటనలతోనే సినిమాను తెరకెక్కించారు, సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ కి వచ్చి ఈ సినిమా చూసే వారి సంఖ్య కూడా బాగుంది. ది కేరళ స్టోరీ సినిమాకు ఆదరణ వస్తుండటంతో నేడు మరిన్ని థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Adipurush : జై శ్రీరామ్.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 70 దేశాల్లో ట్రైలర్ రిలీజ్..

సైలెంట్ గా మౌత్ టాక్ తో ది కేరళ స్టోరీ సినిమాకు ఆదరణ వస్తుండటంతో ఇది కూడా మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా అని అనుకుంటున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాని కూడా మొదట వ్యతిరేకించారు. కానీ చిన్నగా రిలీజ్ అయి నోటి మాటతోనే ప్రమోట్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పుడు కేరళ స్టోరీ సినిమాలో కూడా ఇదే జరగొచ్చని భావిస్తున్నారు పలువురు.