Adipurush : జై శ్రీరామ్.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 70 దేశాల్లో ట్రైలర్ రిలీజ్..

ఆదిపురుష్ సినిమాను జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి శరవేగంగా వర్క్ చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మెల్లిగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్.

Adipurush : జై శ్రీరామ్.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 70 దేశాల్లో ట్రైలర్ రిలీజ్..

Prabhas Adipurush Movie trailer Release date fix

Adipurush :  ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ తో విమర్శలు రాగా సినిమాని వాయిదా వేసి మరోసారి గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు చిత్రయూనిట్.

ఆదిపురుష్ సినిమాను జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి శరవేగంగా వర్క్ చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మెల్లిగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్. గత కొద్దిరోజులుగా ఆదిపురుష్ ట్రైలర్ మే 9న రిలీజవుతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు చిత్రయూనిట్ అధికారికంగా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

Shakunthalam : నెల తిరగకముందే.. శాకుంతలం ఓటీటీ బాట.. ఎప్పుడో తెలుసా?

ఆదిపురుష్ ట్రైలర్ మే 9న రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఏకంగా నెల రోజుల ముందే ట్రైలర్ ని విడుదల చేయడం విశేషం. ఆదిపురుష్ ట్రైలర్ ని పలు దేశాల్లోని థియేటర్స్ లో కూడా స్పెషల్ స్క్రీనింగ్స్ వేయనున్నారు. ఏకంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ జరగబోతోంది. సినిమాను కూడా భారీగా ప్రపంచమంతా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులని మెప్పిస్తుందా లేక గతంలో టీజర్ లాగా నిరాశపరుస్తుందా చూడాలి.