Shakunthalam : నెల తిరగకముందే.. శాకుంతలం ఓటీటీ బాట.. ఎప్పుడో తెలుసా?

శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది.

Shakunthalam : నెల తిరగకముందే.. శాకుంతలం ఓటీటీ బాట.. ఎప్పుడో తెలుసా?

Samantha Shakunthalam Movie OTT Release Date

Updated On : May 6, 2023 / 7:46 AM IST

Shakunthalam :  ఇటీవల సమంత(Samantha) నటించిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజయింది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కింది. సమంత, దేవ్ మోహన్(Dev Mohan), మోహన్ బాబు(Mohan Babu), అల్లు అర్హ(Allu Arha), అనన్య నాగళ్ళ.. పలువురు ముఖ్య పాత్రల్లో చేసిన శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ అయి పెద్ద షాక్ ఇచ్చిందని స్వయంగా చెప్పారు. దాదాపు ఈ సినిమా వల్ల 30 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు సమాచారం. ఇటీవల సినిమాలు త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శాకుంతలం కూడా రిలీజయి నెల అవ్వకముందే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

Kartik Aryan : అమ్మ క్యాన్సర్ ని గెలిచింది.. బాలీవుడ్ స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్

సమంత శాకుంతలం సినిమా మే 12న అమెజాన్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఫ్లాప్ టాక్ అని రావడంతో థియేటర్స్ కి వెళ్లకుండా ఉన్నవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. థియేటర్స్ లో మెప్పించలేకపోయిన శాకుంతలం సినిమా అమరి ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తుందేమో చూడాలి.