The Kerala Story: రెండో రోజు సాలిడ్ వసూళ్లతో అదరగొట్టిన ‘ది కేరళ స్టోరి’

అదా శర్మ నటించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరి’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి.

The Kerala Story: రెండో రోజు సాలిడ్ వసూళ్లతో అదరగొట్టిన ‘ది కేరళ స్టోరి’

The Kerala Story Solid Two Days Collections

Updated On : May 7, 2023 / 8:31 PM IST

The Kerala Story: గతంలో యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో మనం చూశాం. కాగా, ఇప్పుడు అదే బాటలో మరో మూవీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘ది కేరళ స్టోరి’ అనే సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. పలు సున్నితమైన అంశాలతో ఈ సినిమాను సుదీప్తో సేన్ డైరెక్ట్ చేశారు.

The Kerala Story : ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ‘ది కేరళ స్టోరీ’ కాశ్మీర్ ఫైల్స్‌కి డబుల్.. అదా శర్మ పెద్ద హిట్టే కొట్టిందిగా!

అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బాలని, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 5న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రాగా, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చారు. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమా జనంలోకి వెళ్లడంతో తొలిరోజు కంటే కూడా రెండో రోజున ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. తొలిరోజున ఈ సినిమా రూ.8.03 కోట్లు రాబట్టగా, రెండో రోజున ఈ మూవీకి రూ.11.22 కోట్లు వచ్చాయి.

The Kerala Story: కాంట్రవర్సీ మూవీకి ట్యాక్స్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏకంగా రూ.19.25 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ది కేరళ స్టోరి మూవీకి రానున్న రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి ఈ మూవీ మున్ముందు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.