The Plated project : ’ఆకలి తీర్చే యజ్ఞం’..‘ఈ ప్లేటు కొనండి..పేదపిల్లల కడుపు నింపండీ..

ఆకలితో అల్లాడే పిల్లల కడుపు నింపటానినకి ’ఆకలి తీర్చే యజ్ఞం’ చేపట్టారు చిత్రేశ్ సిన్హా. ‘ఈ ప్లేటు కొనండి..పేదపిల్లల కడుపు నింపండీ..అనే నినాదంతో పేదపిల్లల ఆకలితీరుస్తున్నారు.

The Plated project : ’ఆకలి తీర్చే యజ్ఞం’..‘ఈ ప్లేటు కొనండి..పేదపిల్లల కడుపు నింపండీ..

The Plated Project

The Plated Project : ఏదైనా దానం చేస్తే చాలు అనేమాట ఉండదు. కానీ ‘కడుపు నిండాక ఇక చాలు అనే మాట ఒక్క అన్నదానానికే ఉంది. అభివృద్ధిచెందిన దేశం అని చెప్పుకునే భారత్ లో ఇంకా ఈనాటికి ఆకలి చావులు ఉంటటం అత్యంత బాధాకరం.గుప్పెడు మెతుకుల కోసం అల్లాడిపోయే ప్రాణాలెన్నో. కడుపునిండా తింటున్న ప్రతిసారీ.. పస్తులతో పడుకుంటున్న నిర్భాగ్యుల గురించి ఆలోచించేవారు ఎంతమంది ఉంటారు? అలా ఆలోచించేవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టే ఇంకా ఎంతోమంది పేదల కడుపులు నిండుతున్నాయి. అటువంటి ఓ గొప్ప మనస్సు గల వ్యక్తికి వచ్చిందే ‘ది ప్లేటెడ్‌ ప్రాజెక్ట్‌’. ఇది ఒక పేరు మాత్రమే కాదు పేద పిల్లల కడుపులు నింపే ప్రాజెక్టు. ‘మీరు ఒక్క ప్లేటు కొంటే 14మంది పేద పిల్లల కడుపు నిండుతుంది’అని చెబుతుంది ఈ ‘ది ప్లేటెడ్‌ ప్రాజెక్ట్’.

Read more : Dehradun Social worker : కరోనాతో అనాథలైన 100మంది చిన్నారులకు ‘JOY’ అండ..

ఒక ప్లేటు = 14 మంది పిల్లలకు అన్నం! ది ప్లేటెడ్‌ ప్రాజెక్ట్‌ లెక్క ఇది. ఒక ప్లేటు అమ్మకంతో వచ్చే డబ్బుతో 14 మంది నిరుపేద పిల్లల కడుపులు నింపుతోందీ సంస్థ.ముంబైకి చెందిన చిత్రేశ్‌ సిన్హా 2019లో ‘ప్లేటు కొనండి. పేదోడికి ప్లేటు భోజనం పెట్టండి’ అన్న నినాదంతో ఎంతోమంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నారు. ఇతని మంచి ఉద్ధేశానికి ఎంతోమంది కళాకారులు చేయి కలిపారు.రంగుల మేళవింపులో కడుపులు నింపుతున్నారు.

చిత్రేశ్ సిన్హా ఆలోచన తెలుసుకున్నాక మొదటి కొన్ని నెలల్లోనే 40మంది కళాకారులు ఆయనతో చేతులు కలిపారు. అలా ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ కళాకారులు ప్లేట్లకు పెయింటింగ్ వేస్తారు. వారి ప్లేట్లలో సాక్షాత్తు ప్రకృతి రంగు రంగులుగా కొలువుతీరుతుంది. అందాల కొలనులు మన కళ్లను కట్టిపడేస్తాయి. శ్రమ జీవుల కష్టం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. వీరు పెయింట్ వేసే ప్లేట్లు మనల్ని రంగుల ప్రపంచంలో విహరించజేస్తాయి.

Read more : Siddharth-Saina : సైనా​పై హీరో సిద్ధార్థ్ ట్వీట్..జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం..అతడి ఖాతా డిలీట్ చేయాలని లేఖ

ఈ కళాకారులు తీర్చిదిద్దే ఈ రంగురంగుల ప్లేట్లు (కంచాలు) మనం ఆహారం తినడానికే కాదు, గోడల మీద, షెల్ఫులలో అలంకరణకు కూడా భలేగుంటాయి. ఈ ప్లేట్ల స్టాటింగ్ ధర రూ.1,420 ఉంటుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ నలుగురు చిన్నారుల్లో ఒకరు ఆకలితోనే ఖాళీ కడుపుతో నిద్రపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరెంతోమంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వాస్తవాలెన్నో ముంబైకు చెందిన చిత్రేశ్ సిన్హా మనసును కదిలించాయి. పేద పిల్లల కడుపులు నింపటానికి ఏమీ చేయలేమా? అని ఆలోచించారు.

అలా చిత్రేశ్‌ సిన్హా 2019లో ‘ది ప్లేటెడ్‌ ప్రాజెక్ట్ ద్వారా పేదపిల్లల కడుపులు నింపాలని నిశ్చయించుకున్నారు. స్వతహాగా సిన్హా కళాకారుడు కాకపోయినా, చిత్రకళ ద్వారా వాస్తవాలను కండ్లకు కట్టినట్లు చూపించే చిత్రకారులంటే చాలా ఇష్టం ఆయనకు. అందుకే వారి ఆశయానికి దగ్గరగా ఉండేలా కళాత్మకమైన కంచాల ద్వారా డబ్బులు సంపాదించి పిల్లల కడుపులు నింపాలనుకున్నారు. ఈ పెయింటింగ్ ప్లేట్లను ఆన్‌లైన్‌లోనూ విక్రయించి వచ్చిన డబ్బులు ప్రతీ అర్ధ రూపాయి పేద పిల్లల ఆకలి తీర్చటానికే ఉపయోగిస్తున్నారు.

Read more : VR headsets for Cows : ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు..పాల ఉత్పత్తి పెరగటంతో రైతు ఫుల్ హ్యాపీ

అలా ఈ మూడేళ్లలో 5 లక్షల మందికి అన్నం పెట్టామని చిత్రేశ్ సిన్హా తెలిపారు. మా కస్టమర్లను అదనంగా ఒక్క రూపాయి కూడా అడగట్లేదు. పెద్ద మనసుతో పళ్లాలను కొంటే చాలు. పరోక్షంగా ఎంతోమంది పేద పిల్లల కడుపులు నింపటానికి సహాయం చేసినట్లే అని అన్నారు ‘ది ప్లేటెడ్‌ ప్రాజెక్ట్‌’ వ్యవస్థాపకుడు చిత్రేశ్‌ సిన్హా.