VR headsets for Cows : ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు..పాల ఉత్పత్తి పెరగటంతో రైతు ఫుల్ హ్యాపీ

ఆవులు ఎక్కువగా పాలు ఇవ్వటానికి ఓ రైతు భలే ఐడియా వేశాడు.ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు అమర్చాడు. దీంతో ఆవులు పాలు ఎక్కువగా ఇస్తున్నాయి. దీంతో రైతు ఫుల్ హ్యాపీ.

VR headsets for Cows : ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు..పాల ఉత్పత్తి పెరగటంతో రైతు ఫుల్ హ్యాపీ

Vr Headsets For Cows

VR headsets for Cows : చేసే ఉద్యోగం మానేసి ఆవుల్ని పెంచటం పాలు అమ్మకం చేపట్టిన ఓ వ్యక్తికి ఓ వింత ఆలోచన వచ్చింది. ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వటానికి ఓ ఐడియా వేశాడు. అమలుచేశాడు. ఇంకేముంది ఆవులు పాలు ఎక్కువ ఇవ్వటం చూసి తన ఐడియా భలే వర్కౌట్ అయ్యిందని ఎగిరి గంతేశాడు. ఇంకీ ఎవరతను..ఏమా ఐడియా అంటే..అతని గురించి తరువా చెప్పుకుందాం..ఆ ఐడియా ఏంటో ముందు తెలుసుకుందాం..

ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వటానికి సదరు వ్యక్తి ఆవులకు వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) (VR headsets)హెడ్‌సెట్లను అమర్చాడు. ప్లాన్ సక్సెస్ కావడంతో ఎగిరి గంతేసాడు ఆ యజమని. ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్లను అమర్చినప్పటి నుంచి రోజుకు 22 లీటర్ల నుంచి 27 లీటర్లకు పాల ఉత్పత్తి పెరిగిందని తెగ సంబరపడిపోతున్నాడు.

Read more : బీజేపీ నేత వ్యాఖ్యలు : ఫ్లూట్ ఊదితే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయ్

సెంట్రల్ టర్కిష్ ప్రావిన్స్ అక్సరయ్‌లో ఓ వ్యక్తికి ఉద్యోగం మానేసి చేయడం ఇష్టం లేక మానేశాడు. వ్యాపారం చేయాలనుకున్నాడు. అలా 2018లో కొన్ని ఆవుల్ని కొని డెయిరీ ఫార్మ్‌ను నెలకొల్పాడు. ఆవులు పాలు బాగానే ఇస్తున్నాయి. ఆదాయం కూడా బాగానే వస్తోంది. ఉద్యోగం కంటే ఇదేబాగుందనుకున్నాడు. కానీ ఆవులు శీతాకాలం మొదలయ్యేసరికి పాలు ఇవ్వడాన్ని తగ్గించేశాయి. దీంతో పాల ఉత్పత్తిని తగ్గిపోయింది. తద్వారా ఆదాయం కూడా తగ్గింది.

Read more : తెల్ల కిట్టమ్మ : చిన్నారి సంగీతానికి పరుగులు పెడుతూ వచ్చేస్తున్న ఆవులు

ఇలా ప్రతీ సంవత్సరం జరుగుతోంది. ఏం చేయాలా? అని ఆలోచించాడు. మ్యూజిక్ కు ఆవులు కనెక్ట్ అవుతాయని తెలుసుకుని ఆవుల కొట్టంలో మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. తరువాత రష్యాలో ఆవులు పాలు బాగా ఇవ్వటానికి హెడ్ సెట్స్ అమరుస్తున్నారని తెలుసుకుని..కొన్ని ఆవులకు వీఆర్ (వర్చువల్‌ రియాలిటీ)హెడ్‌సెట్ అమర్చాడు. వాటి పాల ఉత్పత్తిని పరిశీలించాడు.గతంలో 22 లీటర్లపాలు ఇచ్చే ఆవు.. ప్రస్తుతం 27 లీటర్ల వరకూ పాలిస్తోందని గుర్తించాడు.

Read more : ఆవు మూత్రం తాగితే కరోనా రానేరాదు..ఈ విషయం గాడిదలకు ఎప్పటికీ అర్థం కాదు

తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంబరపడిపోతు ఆవులన్నింటికి వీఆర్ హెడ్‌సెట్ అమర్చాడు. ప్లాన్ సక్సెస్ అవడంతో..ఎగిరి గంతేశాడు. పాల ఉత్పత్తి పెరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్‌లు అమర్చడం ద్వారా ఫార్మ్‌లో కాకుండా బయట వాతావణంలో ఉన్నట్టు అవి భావించాయని..ప్రశాంతమైన మ్యూజిక్‌ను ప్లే చేయడం వల్ల ఆవులు ఆనందానికి లోనై గతంలో 22 లీటర్లపాలు ఇచ్చే ఆవు.. ప్రస్తుతం 27 లీటర్ల వరకూ ఇస్తుందని తెలిపాడు.