బీజేపీ నేత వ్యాఖ్యలు : ఫ్లూట్ ఊదితే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయ్

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 04:36 AM IST
బీజేపీ నేత వ్యాఖ్యలు : ఫ్లూట్ ఊదితే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయ్

వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు ముందుంటారు. దేవుళ్ల గురించి..వారి కులాల గురించి..పలు వ్యాఖ్యలు చేసిన సందర్భాల గురించి ఎన్నో విన్నాం. ఇప్పుడు అస్సాం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లూటు ఊదితే ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయంటూ గీతోపదేశం చేశారాయన. దానికి లాల్డ్ కృష్ణాను ఎగ్జాంపుల్ గా చెప్పారు. 

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వేణువు (ఫ్లూటు) వాయించటం వల్లే గోకులంలో ఆవులు ఎక్కువ పాలిచ్చాయని సెలవిచ్చారు. కృష్ణుడు వేణుగానంతో పరవశించిపోయిన గోవులు.. ఎక్కువ పాలిచ్చాయని వెల్లడించారాయన. అసోం రాష్ట్రం సిల్చార్ పట్టణంలో బారక్ వ్యాలీలో జరిగిన సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న దిలీప్ కుమార్ పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంగీతం, నృత్యం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు.  అంతవరకూ బాగానే ఉంది. శ్రీ కృష్ణుడు వేణుగానానికి ఆవులు పరవశించిపోయి అధికంగా పాలు ఇస్తాయనీ..ఇది శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని వివరించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధనలో వేణుగానం విన్న ఆవులు ఎక్కువ పాలు ఇచ్చాయనే రిపోర్టులను కూడా వివరించారు ఎమ్మెల్యే దిలీప్ కుమార్. విదేశీ ఆవుల కంటే దేశీయ ఆవులు  నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు ఇస్తాయని.. ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మేము జరుగుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారని ప్రకటించేశారాయన. దేశీయ ఆవు పాలతో తయారు చేసిన  చీజ్, బట్టర్ రుచికరంగా ఉంటుందన్నారు. భారతదేశ ఆవుల్ని అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్ లోకి స్మగ్లింగ్ చేస్తున్నారని, అడ్డుకోవటం ప్రజల బాధ్యత అని గుర్తించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే.