The Warrior: రామ్ పోతినేని ‘ది వారియర్’కు అక్కడ ట్రెమెండస్ రెస్పాన్స్..!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన యాక్షన్ మూవీ ‘ది వారియర్’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కానీ, ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

The Warrior: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన యాక్షన్ మూవీ ‘ది వారియర్’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా రామ్ కెరీర్‌లో ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.
The Warrior: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ది వారియర్..!
అయితే ఈ సినిమాకు ఓటీటీలో, బుల్లితెరపై ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. యాక్షన్ సినిమాలకు పట్టం కట్టే బాలీవుడ్ జనాలు, ఈ సినిమాకు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ది వారియర్ హిందీ వెర్షన్ మూవీకి యూట్యూబ్‌లో ఏకంగా 50 మిలియన్‌కు పైగా వ్యూస్ రావడం విశేషం.
The Warrior: ది వారియర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?
ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, అందాల భామ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కాగా, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు బాలీవుడ్ జనాలు మున్ముందు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.