The Warrior: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ది వారియర్..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ‘ది వారియర్’ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 11న డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

The Warrior: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ది వారియర్..!

Ram Pothineni The Warrior Ott Date Locked

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ‘ది వారియర్’ రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, రామ్ తన కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాను తెరకెక్కించడంతో ‘ది వారియర్’ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 14న రిలీజ్ చేశారు.

The Warrior: ది వారియర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

కట్ చేస్తే.. ఈ సినిమా తొలిరోజే మిక్సిడ్ టాక్‌‌ను తెచ్చుకోవడంతో, ఈ సినిమాను చేసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా చాలా తక్కువ సమయంలో థియేట్రికల్ రన్‌ను ముగించుకుంది. కాగా, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్ స్టార్ ‘ది వారియర్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అయిన 28 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

The Warrior: ‘ది వారియర్’ సక్సెస్ సెలబ్రేషన్స్..

ది వారియర్ చిత్రాన్ని ఆగస్టు 11న డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ రెండు విభిన్న లుక్స్‌లో కనిపించగా, అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.