Fermented Rice: ప్రపంచం మెచ్చిన చద్దన్నం.. పోషకాల నిలయం!

పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత అందరికీ తెలిసిందే.. అందరూ ఏదో ఒక సందర్భంలో విన్నదే. ఈ మాట తాతల నాటిదే అయినా ఇప్పటికీ మన మధ్య వింటున్నాం అంటే సద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. అప్పట్లో రాత్రివేళ ఎవరైనా అనుకోని అతిథి వస్తారేమోనన్న ముందుజాగ్రత్తతో అన్నం ఎక్కువగా వండేవారు. ఎవరూ రాకపోతే అది మిగిలి మరుసటి రోజు సద్ది అన్నంగా మారిపోయేది.

Fermented Rice: ప్రపంచం మెచ్చిన చద్దన్నం.. పోషకాల నిలయం!

Fermented Rice

Fermented Rice: పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత అందరికీ తెలిసిందే.. అందరూ ఏదో ఒక సందర్భంలో విన్నదే. ఈ మాట తాతల నాటిదే అయినా ఇప్పటికీ మన మధ్య వింటున్నాం అంటే సద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. అప్పట్లో రాత్రివేళ ఎవరైనా అనుకోని అతిథి వస్తారేమోనన్న ముందుజాగ్రత్తతో అన్నం ఎక్కువగా వండేవారు. ఎవరూ రాకపోతే అది మిగిలి మరుసటి రోజు సద్ది అన్నంగా మారిపోయేది. ఉదయం గంజి లేదా మజ్జిగతో ఉల్లిపాయ, పచ్చిమిర్చితో కలిపి తినడం అనాదిగా వస్తుంది.

Fermented Rice

Fermented Rice

అయితే మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతి ప్రవేశంతో పాతతరం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఈ రోజుల్లో అలా మిగులకుండా వండుకోవటం అలవాటుగా మారింది. కానీ కరోనా మహమ్మారి చాలామందిని మళ్లీ పాత అలవాట్లవైపు తిప్పింది. గ్రామాల్లో అక్కడక్కడ కనిపించే ఈ సద్దన్నం సంస్కృతి ఇప్పుడు నగరాలకు పాకింది. సద్దన్నంలో రోగనిరోధక శక్తి ఉంటుందని నిపుణులు సూచించడంతో ఇప్పుడు ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌లో కూడా చద్దన్నం చేరిపోయింది. ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్లో స్పెషల్ మెనూలో చేరిన ఈ చద్దన్నం ఫెర్మెంటేడ్ రైస్ గా మారిపోయింది.

Fermented Rice

Fermented Rice

రాత్రి మిగిలినదానిని పొద్దున తినడం నామోషీగా ఫీలైతే ఇప్పుడు దానిలోనే గొప్ప పోషకాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కొందరు రాత్రి మిగిలిన అన్నంలో ఉదయాన్నే పులిసిన మజ్జిగ, పెరుగు పోసుకుని తినేవారూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో మిగిలిన అన్నంలో పాలు, పెరుగు పోసితోడుపెట్టి ఉదయాన్నే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి తింటారు. మొత్తంమీద మిగిలిన అన్నాన్ని నీళ్ళలోనో, గంజిలోనో పులియబెట్టి తినడం అన్నది దేశవ్యాప్తంగా ఉంది. చద్దన్నాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలిచినా ప్రాధాన్యత మాత్రం దేశమంతా ఒక్కటే.

Fermented Rice

Fermented Rice

చద్దన్నం గొప్పతనాన్ని తెలుసుకున్న విదేశీయులు సైతం ఈ సూత్రాన్ని ఆచరించడంతో పాటు.. కరోనా పుణ్యమా అని మనకి మంచి చేసే బ్యాక్టీరియా ఈ చద్దన్నంలోనే పుష్కలంగా ఉందని తెలియడంతో ఇప్పుడు మన దేశంలో స్పెషల్ సూపర్ ఫుడ్ గా మారిపోయింది. చద్దన్నం జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాలను హరించి మంచి బ్యాక్టీరియాను పెంచడంతో ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. పులిసే ప్రక్రియలో బ్యాక్టీరియా చద్దన్నంలోని పోషకాలతో చర్యలు జరపడంతో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం రెట్టింపు అవుతాయట. అందుకే చద్దన్నం మంచి బ్యాక్టీరియాను పెంచి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందట.