Pan India Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్‌పై టాలీవుడ్ దండయాత్ర! This is Tollywood Invasion on Bollywood with Telugu Star's Pan India Films

Pan India Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్‌పై టాలీవుడ్ దండయాత్ర!

బాలీవుడ్ అంటే ఒకప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి బాద్షా.. కాని ఇప్పుడు ఆ బాద్షాకే ఎర్త్ పెడుతోంది టాలివుడ్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ తో.. తెలుగు హీరోలు హిందీ ఫిల్మ్..

Pan India Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్‌పై టాలీవుడ్ దండయాత్ర!

Pan India Films: బాలీవుడ్ అంటే ఒకప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి బాద్షా.. కాని ఇప్పుడు ఆ బాద్షాకే ఎర్త్ పెడుతోంది టాలివుడ్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ తో.. తెలుగు హీరోలు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. మన అడ్డా కాకపొయ్యినా కోట్లు కొల్లగొడుతున్నారు. మనోళ్ల స్పీడుకు నార్త్ లో స్టార్ హీరోలు సైతం భయపడే రోజులొచ్చాయి ఇప్పుడు.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదమ్మా.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతున్నారా లేదా.. బాక్సాఫీస్ షేక్ అవుతుందా లేదా అనేది ముఖ్యం. బాలివుడ్ లో తెలుగు సినిమాల హవా ఈ రేంజ్ లో కొనసాగుతోందిప్పుడు. బ్యాక్ టూ బ్యాక్ ప్యాన్ ఇండియా మూవీస్ తో బాలివుడ్ ని అల్లాడిస్తోంది టాలివుడ్.

Deepika Padukone: అందాల ద‌డ పుట్టిస్తున్న దీపిక ప‌దుకొణె!

అసలు బాలివుడ్ లో ఈ సినిమా ఆడుతుందా.. ఆ లుక్కేంటి.. ఆ లాంగ్వేజ్ ఏంటి అన్నారు మొదట్లో. కాని పుష్పరాజ్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ఫ్రూవ్ అయ్యింది. పుష్ప మ్యానరిజానికి.. స్టోరీకి.. హిందీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఊర మాస్ కంటెంట్ తో హిందీ ఆడియన్స్ కరువు తీర్ఛింది పుష్ప. హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా నిలిచింది. అలాగే పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేసింది. ఇప్పటికీ హిందీ ఆడియన్స్.. సోషల్ మీడియాలో పుష్ప మీమ్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారంటే.. ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో తెలుస్తోంది.

Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

ప్రస్తుతం సౌత్ మూవీ అంటేనే.. బాలివుడ్ హీరోలు భయపడే సిచ్చుయేషన్ నడుస్తోంది. ఎందుకంటె తెలుగు సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.. బాహుబలి, బాహుబలి కంక్లూజన్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న త్రిబుల్ ఆర్ పై.. టాలివుడ్ కి మించిన క్రేజ్ ఉంది బాలివుడ్ లో. ఇప్పటిదాకా రిలీజ్ ఐన ట్రైలర్స్, టీజర్స్ వ్యూవర్ షిప్ లో హిందీ ఆడియన్స్ దే పైచేయి. అందుకే త్రిబుల్ ఆర్ వస్తోందంటె హిందీ స్టార్ హీరోల సినిమాలు సైతం పక్కకు తప్పుకునే పరిస్థితి ఉంది.

Rashmi Gautam: పూల చీరలో మెరిసిపోతున్న బుల్లితెర క్వీన్ రష్మీ!

బాహుబలితో బాలివుడ్ లో తనకంటూ సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న.. డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా చేసినా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధే శ్యామ్, ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సలార్ మూవీస్ పై హిందీ ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అన్నింటికి మించి బాలివుడ్ లో కూడా ప్రభాస్ కి ఇప్పుడు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే.. ప్రభాస్ ప్రతి సినిమా హిందీలో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

ఒకప్పుడు తెలుగు హీరోలు బాలివుడ్లో ఒకటి అర సినిమాలు చేస్తె గొప్ప విషయం.. కాని ఇప్పుడు రోజులు మారాయి. స్టార్ డమ్ ఉన్న పెద్ద హీరోలే కాదు.. టాలివుడ్ యంగ్ హీరోస్ కూడా హిందీ ఆడియన్స్ ను బుట్టలో వేసుకునే పనిలో ఉన్నారు. అర్జున్ రెడ్డి మూవీతో రౌడీ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో బాలివుడ్ లో లక్కు చెక్ చేస్కోబోతున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న లైగర్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. హిందీ ఆడియన్స్ నుంచి టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

అడవి శేష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న మేజర్.. రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు స్టోరీలు కరువై తెలుగు సినిమాల్ని రీమేక్ చేసి పబ్బం గడుపుకునే స్థితికి వచ్చేసింది బాలివుడ్. ప్రెజెంట్ అర డజనుకు పైగా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయంటే.. బాలివుడ్ లో మన హవా మామూలుగా లేదు. ఏకంగా దండయాత్ర చేస్తున్నారు మనోళ్లు.

×