Mental Stress : ఒత్తిడితో గుండెకు ముప్పే!…

ఎవరికైనా ఒత్తిడి సమస్య కారణంగా గుండెలో ఇబ్బంది కరమైన పరిస్ధితి ఉంటే ఏచిన్న అనుమానం ఉన్నా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం మంచిది.

Mental Stress : ఒత్తిడితో గుండెకు ముప్పే!…

Mental Stress

Mental Stress : ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు , బాధ్యతలు చాలా మందిలో ఒత్తిడికి కారణమౌతున్నాయి. మానసిక ఒత్తిడి శరీరా అవయవాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి కారణంగా బీపి, కొలెస్ట్రాల్, డయాబెటీస్ వంటి రుగ్మతులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఒత్తిడి కారణంగా చాలా మందిలో నిద్రపట్టకపోవటం, చెమటపట్టటం, పనిలో ఏకాగ్రత లేకపోవటం, ఆందోళనగా ఉండటం , గుండెలో భారంగా అనిపించటం, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

ఒత్తిడి చివరకు గుండె జబ్బుల సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా యుక్తవయస్సు వారిలో అధికంగా ఉన్నట్లు తేలింది. 30 నుండి 40 సంవత్సరాల వారిలో ఎక్కువ మంది ఒత్తిడి కారణంగా గుండె జబ్బులకు లోనవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు ఇలా అధిక ఒత్తిడికి గురయ్యే ఉద్యోగుల్లో హృద్రోగాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

ఎవరికైనా ఒత్తిడి సమస్య కారణంగా గుండెలో ఇబ్బంది కరమైన పరిస్ధితి ఉంటే ఏచిన్న అనుమానం ఉన్నా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం మంచిది. మానసిక ఒత్తిడితోపాటు హృద్రోగ ముప్పును గుర్తించేందుకు ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్, ఇకో కార్డియోగ్రామ్, యాంజియోగ్రామ్, టీఎంటీ పరీక్షలు చేయించుకోవాలి. యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెజబ్బు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవటం ద్వారా ఒత్తిడి లేకుండా చూసుకోవటం అవసరం. సమయానికి బోజనం చేయటం. సాత్వికాహారాన్ని తీసుకోవటం, పండ్లు, కూరగాయాలు వంటి వాటిని రోజు వారి ఆహారం భాగం చేసుకోవటం, యోగా, వ్యాయామం వంటి వాటిని చేయటం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం, ఆత్మీయులతో మాట్లాడటం, కొత్త ప్రాంతాలకు వెళ్లటం వంటి వాటి వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.