Movies : మూడు సినిమాలు.. మూడు పరిశ్రమలు.. టాక్ ఏంటి??

మూడు ఇండస్ట్రీల నుంచి మూడు వేరు వేరు జానర్లలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేటవడం...................

Movies : మూడు సినిమాలు.. మూడు పరిశ్రమలు.. టాక్ ఏంటి??

Bollywood

Tollywood :  కొవిడ్ తర్వాత మొదటిసారి ఒకే శుక్రవారం రిలీజైన మూడు పరిశ్రమల సినిమాలు మేకర్స్ ను రిలాక్స్ అయ్యేలా చేశాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి రిలీజైన మూడు పాన్ ఇండియా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ లో ఎలా అయితే వెనుకంజలో ఉన్నాడో అక్షయ్ సినిమా రిజల్ట్ లో కూడా అడివి శేష్, కమల్ తర్వాతే అన్నట్టు నిలబడ్డాడు.

మూడు ఇండస్ట్రీల నుంచి మూడు వేరు వేరు జానర్లలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాలకు పాజిటివ్ బజ్ క్రియేటవడం ఇప్పుడు స్పెషాలిటీ. ఒకే రోజు రిలీజై హిట్ కొట్టడమంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. ఈ లెక్కన టాలీవుడ్ మేజర్, కోలీవుడ్ విక్రమ్ హిట్ టాక్ సాధిస్తే బాలీవుడ్ పృథ్వీరాజ్ బాలీవుడ్ లో హిట్ కొట్టి మిగిలిన చోట్ల పర్వాలేదనిపించాడు.

ఎమోషనల్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకొచ్చింది మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇచ్చిన సరైన ట్రిబ్యూట్ అని చాలామందే ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్ కాస్త స్లో అనిపించినా అడివి శేష్ సూపర్బ్ యాక్టింగ్, శశి కిరణ్ డైరెక్షన్, ఆకట్టుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ముఖ్యంగా ఆర్ట్ అండ్ టెక్నికల్ వర్క్… ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. సో ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాల్సిన ఎమోషనల్ జర్నీగా మేజర్ కు తీర్పునిస్తున్నారు ప్రేక్షకులు.

భారీ కాస్ట్ తో వచ్చిన విక్రమ్ సైతం పాన్ ఇండియా లెవెల్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని తమిళ్ లో సూపర్ హిట్ అనిపించుకుంటోంది. కమల్ హాసన్ యాక్టింగ్, సూర్య వైల్డ్ గెటప్ అండ్ సెటప్, విజయ్ సేతుపతి విలనిజం, ఫహాద్ ఫాజిల్ ఎమోషనల్ సీన్స్ విక్రమ్ కి బలంగా నిలిచాయి. విక్రమ్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే మూవీ ఎమోషన్ కి తగ్గట్టు ఎస్టాబ్లిష్మెంట్ లేదనే టాక్ కూడా స్ర్పెడ్ అవుతోంది. ఓవరాల్ గా లోకేష్ కనగరాజ్ తెరెకెక్కించిన టెక్నికల్ ప్రాజెక్ట్ విక్రమ్ మంచి పేరే సంపాందిస్తోంది.

Prabhas : ప్రభాస్.. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్..

ఇక మేజర్, విక్రమ్ తర్వాత బాలీవుడ్ మూవీ పృథ్వీరాజ్ కు సైతం కొన్ని చోట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అందుతున్నాయి. సినిమాటోగ్రఫీతో పాటూ విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ వంటి టెక్నికల్ అంశాలు పృథ్వీరాజ్ కి కలిసొచ్చాయి. కొన్ని చోట్ల యావరేజ్ టాక్ వినిపిస్తోన్నా అక్షయ్ అభిమానులు మాత్రం పృథ్వీరాజ్ తో కనెక్ట్ అవుతున్నరు. కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్ హిస్టరీని ప్రతి ఒక్కరూ చూడాలంటూ ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి అక్షయ్ ఎంట్రీ సీన్, ఇంట్రవెల్ లైనప్ లో వచ్చే కొన్ని వార్ సీన్స్, క్లైమాక్స్ ముందు వచ్చే స్ట్రాంగ్ సీక్వెన్స్ లతో పృథ్వీరాజ్ గట్టెక్కే ఛాన్స్ ఉంది. ఇలా మూడు ఇండస్ట్రీలు ఈ వారానికి హిట్ కొట్టేశాయి అంటున్నారు ప్రేక్షకులు.