RRR: తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు ఇవే!

సినిమాకి టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిశారు. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ జీవోలు.....

RRR: తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు ఇవే!

Rrr Tickets

 

RRR :  రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

సినిమాకి టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిశారు. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ జీవోలు ఇచ్చాయి. ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ ని 75 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని తెలిపారు. తాజాగా తెలంగాణాలో కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతులు ఇస్తూ జీవోని విడుదల చేశారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్.. మొదటిసారి పలు ఆఫ్రికా దేశాల్లో తెలుగు సినిమా రిలీజ్..

తాజాగా ఇచ్చిన జీవో ప్రకారం తెలంగాణలో సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. ముల్టీప్లెక్స్ థియేటర్స్, ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడు రోజులు వంద రూపాయలు తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకునేలా జీవో ఇచ్చారు. అంతేకాక సాధారణ థియేటర్లలో మార్చి 25వ తేదీ నుండి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల ఏపీ కూడా రోజుకు అయిదు ఆటలకి పర్మిషన్ ఇచ్చింది.

 

Rrr Tickets (1)

Rrr Tickets (1)