TN Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు

తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సాయుధ దళాలకు చెందిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు.

TN Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు

Tn Chopper Crash 6 Bodies Of Armed Forces Personnel Identified, Process Continues For Remaining Victims

TN Chopper Crash:  తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సాయుధ దళాలకు చెందిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయితేజతోపాటు వివేక్‌ కుమార్‌, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. లాన్స్ నాయక్ సాయితేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ సహా మరో నలుగురు వాయిసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ శనివారం కూడా కొనసాగుతోంది. వారి పార్థివదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

మృతదేహాలను విమానాల్లో వారి స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో CDS జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, డిఫెన్స్ అడ్వైజర్ బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ సహా కనీసం 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైంది. సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ లిద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మరో పది మంది మృతదేహాలను గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ బేస్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. వీరి మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం గుర్తించనున్నారు.

ఢిల్లీ కాంట్ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో గుర్తించిన సైనికుల పార్థివ దేహాలకు సైనిక అధికారులు నివాళులర్పించనున్నారు. అవశేషాలను గుర్తించేందుకు మొత్తం 10 మంది సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులు దేశ రాజధానికి చేరుకున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల సాయంతో పాటు మృతదేహాలను గుర్తించేందుకు శాస్త్రోక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించిన వెంటనే వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. డిసెంబర్ 11న IAF విమానం ద్వారా సైనికుల మృతదేహాలు ఈ కింది సమయాల్లో గమ్యానికి చేరుకునే అవకాశం ఉంది.

ఆ వివరాలు ఇవే..
– WG CDR చౌహాన్ / ఆగ్రా / ఉదయం 9:45 గంటలకు
– JWO ప్రదీప్ / సులార్ / ఉదయం 11 గంటలకు
– Sqn LDR కులదీప్ / పిలాని / ఉదయం 11:45 గంటలకు
– JWO దాస్ / భువనేశ్వర్ / మధ్యాహ్నం 1 గంటకు
– L /nk B సాయి తేజ / బెంగుళూర్ / మధ్యాహ్నం 12:30 గంటలకు
– L/nk వివేక్ కుమార్/ గగ్గల్/ ఉదయం 11:30 గంటలకు