IND vs NZ T20 Match: నేడు కివీస్‌ వర్సెస్ టీమిండియా టీ20 మ్యాచ్.. కుర్రాళ్లకు పరీక్ష.. శుభ్‌మన్ గిల్ అరంగ్రేటం?

కివీస్‌తో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కుర్రాళ్లకు పరీక్షగా మారనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే హార్థిక్ సారథ్యంలో టీమ్ ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లింది. టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్- రాహుల్ ఈ సిరీస్‌లో లేకపోవటంతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

IND vs NZ T20 Match: నేడు కివీస్‌ వర్సెస్ టీమిండియా టీ20 మ్యాచ్.. కుర్రాళ్లకు పరీక్ష.. శుభ్‌మన్ గిల్ అరంగ్రేటం?

India vs New Zealand

IND vs NZ T20 Match: న్యూజీలాండ్ జట్టుతో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు న్యూజీల్యాండ్‌లోని వెల్లింగ్టన్ రీజినల్ స్టేడియంలో మొదటి మ్యాచ్‌ జరుగుతుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమ్ఇండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఈ రెండు జట్లు పరాభవంతో ఇంటిదారిపట్టాయి. సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ఇండియా ఓటమిపాలవ్వగా, పాకిస్థాన్ జట్టుపై న్యూజీలాండ్ ఓడిపోయింది. ఈ రెండు జట్లు నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు పట్టుదలతో ఉన్నాయి.

New Zealand vs India: టీమిండియాలో చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు: కానె విలియమ్సన్

కివీస్‌తో జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కుర్రాళ్లకు పరీక్షగా మారనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే హార్థిక్ సారథ్యంలో టీమ్ ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లింది. టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్- రాహుల్ ఈ సిరీస్‌లో లేకపోవటంతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వన్డేల్లో సత్తాచాటిన శుభ్‌మన్ గిల్ టీ20ల్లో అరంగేట్రం చేయడం లాంఛనమేనని చెప్పాలి. దినేశ్ కార్తీక్ ఉండటంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోయిన పంత్ ఈ సిరీస్‌లో కీపర్, బ్యాటర్‌గా కీలకంకానున్నాడు.

టీ20 ప్రపంచకప్‍ సెమీఫైనల్‌లో ఓటమిపాలైన కివీస్ జట్టు స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. సొంతగడ్డ, తెలిసిన పరిస్థితులు, ఇష్టమైన ఫార్మాట్లో విలియమ్సన్ సేనను ఆపడం భారత్ జట్టుకు అంత ఈజీ పనికాదు. గుప్తిల్ గాయం నుంచి కోలుకోవటంతో కాన్వేతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నారు. వెల్లింగ్టన్ పిచ్ ఆ దేశంలోని మిగిలిన గ్రౌండ్‌లలో పిచ్‌లకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మొదటి బ్యాటింగ్ జట్టు సగటు స్కోరు 162 పరుగులే. ఇక్కడ చలిగాలులతో కూడిన వాతావరణం ఉంటుంది.