New Zealand vs India: టీమిండియాలో చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు: కానె విలియమ్సన్

భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ టీమిండియా ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. వారి ప్రతిభ ఏంటో తాను చూశానని అన్నాడు. టీమిండియాలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారని ఆయన చెప్పాడు. తమ జట్టు గురించి కానె విలియమ్సన్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తమ దేశ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడని అన్నాడు.

New Zealand vs India: టీమిండియాలో చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు: కానె విలియమ్సన్

New Zealand vs India: భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ టీమిండియా ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. వారి ప్రతిభ ఏంటో తాను చూశానని అన్నాడు. టీమిండియాలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారని ఆయన చెప్పాడు. తమ జట్టు గురించి కానె విలియమ్సన్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తమ దేశ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడని అన్నాడు.

మరోసారి అతడు మెరుస్తాడని తాను ఆశిస్తున్నట్లు చెప్పాడు. అతడు ప్రపంచ స్థాయి ఆటగాడని అన్నాడు. న్యూజిలాండ్ జట్టులో మళ్ళీ అతడిని చూడాలని తాము భావిస్తున్నట్లు చెప్పాడు. అయితే, కెరీర్ పరంగా ఆటగాళ్లు పలు నిర్ణయాలు తీసుకుంటారని, ఆ స్వేచ్ఛ వారికి ఉందని అన్నాడు. కాగా, భారత్ తో వన్డే, టీ20ల్లో బౌల్ట్ ఆడడం లేదు. కాగా, తనను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి దూరంగా ఉంచాలని ఈ ఏడాది ఆగస్టులో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును బౌల్ట్ కోరాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..