Toll Tax Hike: కేంద్రం మరో బాదుడు.. టోల్ ట్యాక్స్ పెంపునకు రంగం సిద్ధం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై అధిక భారం పడనుంది. టోల్ ట్యాక్స్ పెంచడం ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియే.

Toll Tax Hike: కేంద్రం మరో బాదుడు.. టోల్ ట్యాక్స్ పెంపునకు రంగం సిద్ధం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Toll Tax Hike: ఇటీవలే గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం ఇప్పుడు మరో బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. టోల్ ట్యాక్స్ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయించింది.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

దీంతో ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై అధిక భారం పడనుంది. టోల్ ట్యాక్స్ పెంచడం ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియే. నేషనల్ హైవేస్ ఫీ (డిటర్మినేషన్ ఆప్ రేట్స్ అండ్ కలెక్షన్) రూల్స్ 2008 ప్రకారం ప్రతి సంవత్సరం టోల్ ఫీజులు పెరుగుతాయి. తాజాగా పెరిగిన ధరల్ని అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎన్‌హెచ్ఏఐ ఇప్పటికే సంబంధిత విభాగాన్ని ఆదేశించింది. మార్చి 25లోపు ఈ పనులు పూర్తి కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలవుతాయి. కొత్త ధరల ప్రకారం.. కార్లు, లైట్ వెహికల్స్ గత ఏడాదికంటే ఒక ట్రిప్పునకు అదనంగా 5 శాతం చెల్లించాలి.

Gold Bars: విమానం టాయిలెట్‌లో రూ.2 కోట్ల విలువైన బంగారు ఇటుకలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు

హెవీ వెహికల్స్ 10 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది మాత్రం అన్ని వాహనాలకు అదనంగా 10-15 శాతం టోల్ ట్యాక్స్ పెంచారు. జాతీయ రహదారులపై అప్పట్లో కనిష్టంగా రూ.10 నుంచి రూ.60 వరకు పెంచారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ వేపై కిలో మీటరుకు రూ.2.19 పైసలు వసూలు చేస్తున్నారు. ఆరు లేన్లు, 135 కిలోమీటర్ల దూరం కలిగిన ‘ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే’, ‘ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే’పై కూడా ధరలు పెరుగుతాయి. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులకు ఇచ్చే నెలవారీ పాసు చార్జీలు కూడా 10 శాతం పెరుగుతాయి.

ఇక, ఇటీవలి కాలంలో టోల్ ట్యాక్సుల నుంచి భారీగా వసూలవుతున్నాయి. గత ఏడాది జాతీయ రహదారులపై రూ.33,881.22 కోట్లు వసూలయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరంకంటే 21 శాతం అధికం.