Tollywood: టీకా తీసుకున్న వారితోనే షూటింగ్స్!

తెలంగాణ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే పగటి సమయంలో కార్యకలాపాలకు ప్రభుత్వం అడ్డంకులు తొలగిపోగా ఇక ఒక్కోక్కటికీ తెరుచుకొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Tollywood: టీకా తీసుకున్న వారితోనే షూటింగ్స్!

Tollywood

Tollywood: తెలంగాణ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే పగటి సమయంలో కార్యకలాపాలకు ప్రభుత్వం అడ్డంకులు తొలగిపోగా ఇక ఒక్కోక్కటికీ తెరుచుకొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే వరసలో సినిమా చిత్రీకరణలు కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గురువారం షూటింగ్‌ల పునఃప్రారంభంపై చలనచిత్ర వాణిజ్య మండలి సమావేశమై చర్చించింది.

సినిమా చిత్రీకరణలు, కొత్త సినిమాల ప్రారంభం, సినీ కార్మికుల ఆరోగ్యంపై నటీనటులు, దర్శకులు, నిర్మాతలతో సంయుక్త సమావేశం నిర్వహించిన వాణిజ్య మండలి ఈ మేరకు పలు తీర్మానాలను ప్రకటించింది. ఇందులో భాగంగా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తుదిదశలో ఉన్న సినిమా షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని సూచించింది.

ఇక, షూటింగ్‌ సిబ్బంది అందరూ కొవిట్‌ టీకా వేసుకోవాలని, కనీసం ఒక డోసు వేసుకున్న వారినే షూటింగ్‌కు అనుమతించాలని చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకుంది. షూటింగ్స్​కు హాజరయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యుల నుంచి నిర్మాణ సంస్థలు కరోనా టీకా తీసుకున్నట్లు నిర్ధారించాకే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఇక ఇండస్ట్రీలో పనిచేసే 24 విభాగాల్లోని కార్మికుల ఆరోగ్య బీమా చేయించేలా ఫిల్మ్ ఫెడరేషన్ కృషి చేయాలని కోరింది.