Mission Impossible 7 : మిషన్ ఇంపాజిబుల్ 7 అప్డేట్ ఇచ్చిన టామ్ క్రూజ్..
ఇండియన్ మూవీ లవర్స్ మార్వెల్ సినిమాలు తరువాత ఎక్కువగా ఇష్టపడే హాలీవుడ్ సిరీస్ 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాల్లో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ..

Tom Cruise Mission Impossible 7 official title poster released
Mission Impossible 7 : ఇండియన్ మూవీ లవర్స్ మార్వెల్ సినిమాలు తరువాత ఎక్కువగా ఇష్టపడే హాలీవుడ్ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సినిమాల్లో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇప్పటికే ఈ సిరీస్ లో 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. ఇక మునపటి సినిమాల్లో కంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే రేంజ్ లో ఉండబోతున్నాయి.
Tom Cruise : 60 ఏళ్ళ ఏజ్ లో ఇన్ని స్టంట్స్.. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా కోసం టామ్ క్రూజ్ విన్యాసాలు..
అంతేకాదు ఇప్పటి వరకు బైక్‌తో నేల పై, హెలికాఫ్టర్‌తో గాలిలో స్టంట్ లు చేసిన టామ్ క్రూజ్.. ఈ మూవీలో ఏకంగా అంతరిక్షంలో సాహసాలు చేయబోతున్నాడు. అందుకోసం స్పేస్ లోకి వెళ్లి ఈ సినిమాని షూట్ చేయనున్నారు. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేయని మేకర్స్.. తాజాగా ఒక టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో టామ్ క్రూజ్ బైక్ తో పర్వతాలు పై నుంచి దూకుతూ గాలిలో ఉన్న దృశ్యం కనిపిస్తుంది.
ఇటీవల ఈ సాహసం చేసిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 60 ఏళ్ళ వయసులో టామ్ క్రూజ్ బైక్ తో కొండ పై నుంచి కిందకి దూకడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మిషన్ ఇంపాజిబుల్ 5, 6 అండ్ టాప్ గన్ మావెరిక్ చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జులై 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
Here’s the official poster for #MissionImpossible – Dead Reckoning Part One starring @TomCruise. Only in theatres July 2023. pic.twitter.com/usWjs6MMqr
— Mission: Impossible (@MissionFilm) March 14, 2023