Yash : ‘కెజిఎఫ్ 2’ నుంచి తూఫాన్ సాంగ్ విడుదల

ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ని కూడా అనౌన్స్ చేశారు. తాజాగా నేడు మార్చ్ 21న 'కెజిఎఫ్ 2' సినిమా నుంచి తూఫాన్ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.

Yash : ‘కెజిఎఫ్ 2’ నుంచి తూఫాన్ సాంగ్ విడుదల

Toofaan Song

KGF 2 : యశ్ హీరోగా వచ్చిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది. భారీ కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ తలరాత మారిపోయింది. 100 కోట్లు రాబట్టిన మొదటి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. అప్పుడే సినిమాకి పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ అయి మూడేళ్లు పైనే అవుతున్నా సినిమా పార్ట్ 2 గురించి దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.

 

ఈ సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక అప్పట్నుంచి సినిమా ప్రమోషన్స్ మెల్లి మెల్లిగా మొదలు పెట్టారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘కెజిఎఫ్ 2’ ట్రైలర్ ని మార్చ్ 27న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అంతలోనే ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ని కూడా అనౌన్స్ చేశారు. తాజాగా నేడు మార్చ్ 21న ‘కెజిఎఫ్ 2’ సినిమా నుంచి తూఫాన్ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.

RRR : అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

‘తూఫాన్ తూఫాన్.. ఎలుగెత్తి ఎగిసి పడగొట్టినదే..’ అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులని మెప్పిస్తుంది. ‘కెజిఎఫ్’ సినిమాలలోని పాటల వలే ఇది కూడా అందర్నీ మెప్పించే విధంగా ఉంది. యశ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల అయిన తర్వాత ‘కెజిఎఫ్ 2’ సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టనున్నారు.