Delhi : టీఆర్ఎస్ చరిత్రలో కీలక మైలురాయి, దేశ రాజధానిలో పార్టీ భవనం
టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మరో కీలక మైలురాయి... ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం.. హస్తిన వరకూ చేరుకుంటోంది.

Trs Bhavan
TRS Bhavan : టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మరో కీలక మైలురాయి… ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం.. హస్తిన వరకూ చేరుకుంటోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. దేశ రాజధానిలో పార్టీ భవనాన్ని నిర్మించుకోబోతుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2021, సెప్టెంబర్ 02వ తేదీ గురువారం శంకుస్థాపన జరగబోతోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
Read More : Y.S.Vijayamma: నేడే వైఎస్ సంస్మరణ సభ.. హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు!
1315 గజాల్లో టీఆర్ఎస్ భవన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 48నిమిషాలకు పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం కేసీఆర్. సతీసమేతంగా ఆయన ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వాస్తుబద్దంగా, వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం స్థల సంప్రోక్షణ, స్థల దిగ్భందన తర్వాత గణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
Read More : Water Dispute : కృష్ణా బోర్డు మీటింగ్..హాట్ హాట్‌గా వాదనలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి సుమారు 500 మందికి పైగా నేతలు, కార్యకర్తలు పూజాకార్యక్రమంలో పాల్గొననున్నారు. అతిధుల కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వర్షాలు పడుతుండటంతో ఇబ్బందులు కలగకుండా.. రెయిన్ ప్రూఫ్ షెడ్ ఏర్పాటు చేశారు. దక్షిణ భారత దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకీ లేని విధంగా ఢిల్లీలో TRSకు హస్తినలో భూమిని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
Read More : Leopard : మేకల మందపై చిరుతపులి దాడి…పోరాడి కొడవలితో నరికి చంపిన కాపరి
జేడీయు, సమాజ్‌వాదీ పార్టీ ఆఫీసులు మధ్యలో TRS భవన్ నిర్మాణం జరగనుంది. ఐదు అంతస్తుల్లో ఈ నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. భూమి చదును వంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు పార్టీ నేతలు… మంత్రులు, ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల ముందు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదిపారు సీఎం కేసీఆర్. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఢిల్లీలో మొదలు కాబోతుంది. దీంతో TRS భవన్ వేదికగా కేసీఆర్.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.