Chef Salt Bae: చెత్త కవరే టీషర్ట్.. ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు!

ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతుంది.. కాదు కాదు అలా అని వాళ్ళు అనుకుంటున్నారని అనుకోవాలేమో. ధాన్యం బస్తాలను వెస్ట్రన్ వేర్ గా చేసుకొని ధరించే మోడల్స్.. పీలికలు..

Chef Salt Bae: చెత్త కవరే టీషర్ట్.. ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు!

Garbage Bag

Updated On : November 1, 2021 / 4:34 PM IST

Chef Salt Bae: ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతుంది.. కాదు కాదు అలా అని వాళ్ళు అనుకుంటున్నారని అనుకోవాలేమో. ధాన్యం బస్తాలను వెస్ట్రన్ వేర్ గా చేసుకొని ధరించే మోడల్స్.. పీలికలు, చీలికలు చేసుకొని బట్టలువేసుకోవడం.. తలదిండును అచ్ఛాదనంగా అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన హీరోయిన్స్ ఇలా చాలామందిని చూసేసాం కదా. ఇక ఇప్పుడు మరో ట్రెండ్ వస్తుంది. అదే చెత్త ఏరుకొనే ప్లాస్టిక్ కవర్ బ్యాగ్స్ ను టీషర్ట్, షర్ట్ లాగా ధరించడమే ఈ ట్రెండ్.

Viral Video : కుక్క చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని కుమ్మిపారేసిన ఆవు

టర్కిష్ చెఫ్‌ నస్రెట్ గోక్సే ఇప్పుడు ఈ చెత్త బ్యాగ్స్ ను టీషర్ట్ గా ధరించే ట్రెండ్ మొదలు పెట్టాడు. ఆహారం పై ఉప్పు చల్లడం, నమ్మశక్యం కానీ వస్తువులతో మాంసాన్ని కోసి చూపించే వీడియోలతో సాల్ట్ బేగా పేరు తెచ్చుకున్న ఈ టర్కిష్ చెఫ్ ఇప్పుడు ఇలా చెత్త కవర్ టీషర్ట్ లాగా ధరించి పక్షులకు గింజలేయడం, పుషప్స్ తీయడం చేస్తూ ఓ వీడియో తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ చెఫ్ చేసిన పనులెలా ఉన్నా తాను ధరించిన షర్ట్ మాత్రం హాట్ టాపిక్ అయింది.

Diwali Day : దీపావళి రోజు వీటిని చూస్తే డబ్బుకు లోటుండదా!…

సోషల్ మీడియాలో చెఫ్ నస్రెట్ చెత్త కవర్ టీషర్ట్ వీడియో తెగ వైరల్ అవుతుండగా కొందరు దీన్ని ఫాలోవుతూ ఇదో గ్రేట్ ఫ్యాషన్ ట్రెండ్ లాగా ఫీలవుతుంటే మరికొందరేమో ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబూ అని తలలు బాదుకుంటున్నారు. నస్రెట్‌ యూకేలోని తన రెస్టారెంట్‌లో అధిక ధరల నేపథ్యంలో ఇలా వైరటీగా ధరించాడు కాబోలు అంటూ రకరకాలుగా నెటిజన్లు చర్చలు మొదలు పెట్టారు. మొత్తంగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nusr_et#Saltbae (@nusr_et)