Raviteja – Bellamkonda : ఒకేసారి రెండు బయోపిక్స్.. టైగర్ నాగేశ్వరరావు మీద ఎందుకింత క్రేజ్!

‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్.. బెల్లంకొండ - రవితేజ హీరోలుగా రెండు సినిమాలు..

Raviteja – Bellamkonda : ఒకేసారి రెండు బయోపిక్స్.. టైగర్ నాగేశ్వరరావు మీద ఎందుకింత క్రేజ్!

Raviteja Bellamkonda

Raviteja – Bellamkonda: మాస్ మహారాజా రవితేజ 71వ సినిమా, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ఒక వ్యక్తి గురించే. ఇద్దరు హీరోలూ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ చేస్తున్నారు. బెల్లంకొండ తెలుగు మాత్రమే చేస్తుంటే రవితేజ పాన్ ఇండియా లెవల్లో చేస్తున్నాడు.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!

ఇద్దరు హీరోలు బయోపిక్స్ చేస్తుండంతో అసలెవరీ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే క్యూరియాసిటీ కలుగుతుంది. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ. అతను స్కెచ్ వేస్తే తిరుగుండదు. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టేలా చోరీలు చేసేవాడు.

Ravi Teja : అసలెవరీ ‘టైగర్ నాగేశ్వరరావు’?

అతని జీవితం ఆధారంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. బెల్లంబాబు ఈ బయోపిక్ చేస్తున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు రవితేజ కూడా అనౌన్స్ చెయ్యడంతో.. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ లైఫ్‌ ఎలా ఉండేది.. ఈ రెండు సినిమాల కథలకు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేక రెండూ ఒకేలా ఉంటాయా అంటూ ఫిలింనగర్‌తో పాటు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది.